Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GBS Case: బిగ్‌ అలర్ట్‌.. తెలంగాణలో తొలి గులియన్‌ బారే సిండ్రోమ్‌ కేసు నమోదు!

GBS Case: గత కొన్ని రోజులుగా మహారాష్ట్రలో కలకలం రేపిన గులియన్‌ బారే సిండ్రోమ్‌ కేసులు తెలంగాణలో నమోదవుతున్నాయి. హైదరాబాద్‌లో గులియన్‌ బారే సిండ్రోమ్‌ (Guillain Barre Syndrome) కేసు నమోదైంది. ఓ మహిళకు జీబీఎస్‌ పాజిటివ్ అని వైద్యులు నిర్ధారించారు. ప్రస్తుతం ఆ మహిళా పేషెంట్ ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది..

GBS Case: బిగ్‌ అలర్ట్‌.. తెలంగాణలో తొలి గులియన్‌ బారే సిండ్రోమ్‌ కేసు నమోదు!
Guillain-Barre syndrome
Follow us
Subhash Goud

|

Updated on: Jan 31, 2025 | 9:37 AM

దేశంలో గులియన్‌ బారే సిండ్రోమ్‌ కలకలం సృష్టిస్తోంది. దేశవ్యాప్తంగా జీబీఎస్‌ కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా.. తెలంగాణలో తొలి జీబీఎస్‌ కేసు నమోదు అయింది. హైదరాబాద్‌లో గులియన్ బారే సిండ్రోమ్ కేసును వైద్యులు గుర్తించారు. సిద్దిపేటకు చెందిన మహిళకు జీబీఎస్ లక్షణాలు ఉండడంతో హైదరాబాద్‌ కిమ్స్ ఆస్పత్రిలో అందిస్తున్నారు. పశ్చిమబెంగాల్‌లో జీబీఎస్‌ కారణంగా గత నాలుగు రోజుల్లో ఒక చిన్నారి సహా ముగ్గురు మరణించారు. మరోవైపు.. మహారాష్ట్రలోని పుణెలోనూ దాదాపు 130 జీబీఎస్‌ అనుమానాస్పద కేసులు నమోదు అయ్యాయి.

దేశంలో గులియన్‌ బారే సిండ్రోమ్‌ కేసులు నమోదు అవుతుండటంతో ఆందోళన నెలకొంది. తెలంగాణలో తొలి జీబీఎస్‌ కేసు నమోదు కావడంతో అధికారులు మరింత అప్రమత్తం అవుతున్నారు. బ్యాక్టీరియా, వైరల్ ఇన్ఫెక్షన్‌ కారణంగా బలహీన రోగనిరోధక శక్తి కలిగిఉన్న వ్యక్తులు ఈ జీబీఎస్ బారినపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. ఈ వైరల్‌ కారణంగా నరాలు బలహీనంగా మారే అవకాశం ఉంటుంది.

లక్షణాలు ఇవే:

ఈ వైరస్‌ సోకిన వ్యక్తికి ఒళ్లంతా తిమ్మిరిగా ఉంటుందని, కండరాలు సైతం బలహీనంగా మారడంతో పాటు డయేరియా, పొత్తికడుపు నొప్పి, జ్వరం, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తాయని వైద్యులు చెబుతున్నారు. కలుషిత ఆహారం తీసుకోవడం, నీటి ద్వారా ఆ బ్యాక్టీరియా సోకుతుందని వైద్యులు చెబుతున్నారు. అయితే ఈ వైరస్‌ వల్ల ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురి కావద్దని, ఈ జీబీఎస్‌ అనేది అంటు వ్యాధి కాదని, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నయం చేసుకోవచ్చని చెబుతున్నారు. గులియన్-బారే సిండ్రోమ్ అనేది శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ నరాలపై ఒత్తిడి పడే అవకాశం ఉంది. కండరాల బలహీనత లేదా పక్షవాతం వంటి లక్షణాలు ఉంటాయి. ఇది బలహీనత, పక్షవాతం లేదా నొప్పిని కలిగిస్తుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

చివరి అంకానికి చేరిన SLBC టన్నెల్‌ రెస్క్యూ ఆపరేషన్‌..!
చివరి అంకానికి చేరిన SLBC టన్నెల్‌ రెస్క్యూ ఆపరేషన్‌..!
పచ్చి బఠానీలు తింటే ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు ఇవే.. తెలిస్తే
పచ్చి బఠానీలు తింటే ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు ఇవే.. తెలిస్తే
పోసాని కృష్ణమురళి అరెస్ట్‌.. అదుపులోకి తీసుకున్న రాయచోటి పోలీసులు
పోసాని కృష్ణమురళి అరెస్ట్‌.. అదుపులోకి తీసుకున్న రాయచోటి పోలీసులు
మస్క్ మిలన్.. తినడం వల్ల మస్త్‌ మస్త్‌ ప్రయోజనాలు..! తెలిస్తే ..
మస్క్ మిలన్.. తినడం వల్ల మస్త్‌ మస్త్‌ ప్రయోజనాలు..! తెలిస్తే ..
బాదంతో తేనె కలుపుకుని తింటే ఎన్ని లాభాలో తెలుసా..? ఇలాంటి రోగాలకు
బాదంతో తేనె కలుపుకుని తింటే ఎన్ని లాభాలో తెలుసా..? ఇలాంటి రోగాలకు
కోహ్లీ క్రేజ్‌: లాహోర్ లో RCB జెర్సీతో ఫ్యాన్ హల్‌చల్!
కోహ్లీ క్రేజ్‌: లాహోర్ లో RCB జెర్సీతో ఫ్యాన్ హల్‌చల్!
ఇదేదో పిచ్చిమొక్క అనుకుంటే మీకే నష్టం... ఈ పూలతో 100 రోగాలకు చెక్
ఇదేదో పిచ్చిమొక్క అనుకుంటే మీకే నష్టం... ఈ పూలతో 100 రోగాలకు చెక్
ఓటీటీలో దుమ్ము రేపుతోన్న లక్కీ భాస్కర్.. ఎక్కడ చూడొచ్చంటే?
ఓటీటీలో దుమ్ము రేపుతోన్న లక్కీ భాస్కర్.. ఎక్కడ చూడొచ్చంటే?
మెగా, అల్లు క్యాంపుల్లో బన్నీ వాసుకు మరింత ప్రాధాన్యం
మెగా, అల్లు క్యాంపుల్లో బన్నీ వాసుకు మరింత ప్రాధాన్యం
ఫోన్‌ ఛార్జింగ్‌ చేసేటప్పుడు ఈ పొరపాట్లు చేస్తున్నారా..?
ఫోన్‌ ఛార్జింగ్‌ చేసేటప్పుడు ఈ పొరపాట్లు చేస్తున్నారా..?