AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: పంజాగుట్ట-జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ ఫ్లైఓవర్‌పై బిగ్ అప్డేట్.. పనులు షురూ.. అప్పటికల్లా అందుబాటులోకి..

హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పంజాగుట్ట-జూబ్లీహిల్స్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ పనులు వేగం పుంజుకున్నాయి. జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ నుంచి పంజాగుట్ట వరకు నాలుగు కిలోమీటర్ల పొడవునా ఆరు లైన్లతో ఈ భారీ ప్రాజెక్టును జీహెచ్‌ఎంసీ నిర్మిస్తోంది. ప్రస్తుతం పిల్లర్ల నిర్మాణానికి సాయిల్ పరీక్షలు శరవేగంగా కొనసాగుతున్నాయి.

Hyderabad: పంజాగుట్ట-జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ ఫ్లైఓవర్‌పై బిగ్ అప్డేట్.. పనులు షురూ.. అప్పటికల్లా అందుబాటులోకి..
Hyderabad
Venkatrao Lella
|

Updated on: Oct 27, 2026 | 9:09 AM

Share

హైదరాబాద్ ప్రజలకు మరో గుడ్ న్యూస్. నగరంలో మరో భారీ ఫ్లైఓవర్ నిర్మాణానికి జీహెచ్‌ఎంసీ సిద్దమైంది. ఇప్పటికే పనులు కూడా మొదలుపెట్టింది. పంజాగుట్ట నుంచి జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వరకు తలపెట్టిన ఎలివేటెడ్ కారిడార్ పనులను జీహెచ్‌ఎంసీ మొదలుపెట్టింది. ఇప్పటికే ఈ మార్గంలో మార్కింగ్‌ పనులు పూర్తి చేశారు. ఎక్కడెక్కడ పిల్లర్లు నిర్మించాలనే దానిపై మార్కింగ్స్ వేశారు. దీంతో ఈ భారీ ఫ్లైఓవర్ పనులు మొదలుపెట్టినట్లయింది. పంజాగట్టలోని ఎన్‌ఎఫ్‌సీఎల్ జంక్షన్ నుంచి జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ మెట్రో స్టేషన్ వరకు ఈ ఎలివేటెడ్ కారిడార్ ఉంటుంది. మొత్తం 4.3 కిలోమీటర్ల మేర ఇది విస్తరించి ఉంటుంది. ఇప్పటికే అనుమతులన్నీ వచ్చేయడంలో పనులను వేగవంతం చేశారు. ఇటీవల జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్.వి కర్ణన్ ఈ ఎలివేటెడ్ కారిడార్ పనులను సమీక్షించారు. ఈ సందర్భంగా పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. కేబీఆర్ పార్క్ మెయిన్ ఎంట్రన్స్ సహా జంక్షన్ల అభివృద్ది పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. ఆరు లైన్లుగా ఈ ఫ్లైఓవర్ ఉంటుంది. పంజాగుట్ట సమీపంలోని ముఫకంజా కాలేజ్ సమీపంలో ఈ ఫ్లైఓవర్ ప్రారంభం కానుండగా.. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36 కలుపుతూ నిర్మించనున్నారు. ఫ్లైఓవర్ పిల్లర్లను నిర్మించబోయే ప్రాంతాల్లో సాయిల్ టెస్ట్ పనులు ప్రస్తుతం యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయి. . జీహెచ్‌ఎంసీ ఇంజనీరింగ్ అధికారుల పర్యవేక్షణలో ఈ పనులు కొనసాగుతున్నాయి.

ఈ ఫ్లైఓవర్‌ను కేవలం రెండేళ్లలోనే పూర్తి చేయాలని జీహెచ్‌ఎంసీ అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే పంజాగుట్ల నుంచి మాదాపూర్, హైటెక్‌సిటీ వైపు ప్రయాణం మరింత సులభతరం కానుంది. సిగ్నల్ లేని ప్రయాణం వల్ల వాహనాలు  మరింత వేగంగా ముందుకు సాగే అవకాశం ఉంది.  పంజాగుట్ట, నాగార్జున సర్కిల్,  టీవీ9 సిగ్నల్, ముగ్ధా జంక్షన్, కేబీఆర్ పార్క్, జూబ్లీ చెక్‌పోస్ట్ సిగ్నల్ వంటి ప్రధాన జంక్షన్ల మీదుగా ఈ కారిడార్ నిర్మాణం చేపడుతున్ారు. ప్రస్తుతం ఈ మార్గంలో రద్దీ ఎక్కువగా ఉండే  సమయాల్లో దాదాపు అరగంట నుంచి 40 నిమిషాల వరకు సమయం పడుతోంది. ఈ ఫ్లైఓవర్ నిర్మాణం వల్ల ప్రయాణ సమయం భారీగా తగ్గే అవకాశముంది. ఈ ప్రాజెక్టును రెండు ప్యాకేజీలుగా విభజించి పనులు చేపడుతున్నారు. జూబ్లీ చెక్‌పోస్ట్ నుంచి ముగ్ధా జంక్షన్ వరకు ప్యాకేజీగా పనులు చేపడుతుండగా. ముగ్ధా జంక్షన్ నుంచి ముఖరంజా కాలేజ్ వరకు రెండో ప్యాకేజీ పనులు చేపడుతున్నారు.

ఈ ప్రాజెక్టు పూర్తయితే పంజాగుట్ట, నాగార్జున సర్కిల్ నుంచి కేబీఆర్ పార్క్, మాదాపూర్, హైటెక్ సిటీ వైపు వెళ్లేవారికి ట్రాఫిక్ రద్దీ తగ్గే అవకాశం ఉందని జీహెచ్‌ఎంసీ అధికారులు చెబుతున్నారు.  ఇప్పటివరకు హైదరాబాద్‌లో ఉన్న అన్ని ఫ్లైఓవర్ల కంటే ఇది అతిపెద్దదిగా నిలవనుంది. నగరంలోని ఇతర ఫ్లైఓవర్లు సాధారణంగా రెండున్నర నుంచి మూడు కిలోమీటర్ల మేర ఉండగా.. ఇది నాలుగు కిలోమీటర్ల పొడవుతో విస్తరించి ఉంటుంది. రెండేళ్ల కాలవ్యవధిలో ఈ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు పనులు శరవేగంగా ముందుకు సాగుతున్నాయి.

Follow Us
పంజాగుట్ట-జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ ఫ్లైఓవర్‌పై బిగ్ అప్డేట్
పంజాగుట్ట-జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ ఫ్లైఓవర్‌పై బిగ్ అప్డేట్
కిచెన్, బాత్‌రూమ్ సింక్‌లో నీళ్లు నెమ్మదిగా పోతున్నాయా? కారణమిదే!
కిచెన్, బాత్‌రూమ్ సింక్‌లో నీళ్లు నెమ్మదిగా పోతున్నాయా? కారణమిదే!
AIతో చిరుతను సృష్టించి వైరల్‌ చేశాడు.. పోలీసులకు చిక్కిన సచిన్‌
AIతో చిరుతను సృష్టించి వైరల్‌ చేశాడు.. పోలీసులకు చిక్కిన సచిన్‌
హైదరాబాద్‌-విజయవాడ హైవేపై ఘోరం.. గాలికి ఎగిరిన టోపీ కోసం వెళ్లి
హైదరాబాద్‌-విజయవాడ హైవేపై ఘోరం.. గాలికి ఎగిరిన టోపీ కోసం వెళ్లి
Viral Video: నిద్రపోతున్న కూలీలపైకి దూసుకొచ్చిన చిరుతపులి..!
Viral Video: నిద్రపోతున్న కూలీలపైకి దూసుకొచ్చిన చిరుతపులి..!
చలికాలంలో అరకు అందాలు.. వెళ్తే ఈ ప్లేసెస్ మిస్ అవ్వకండి!
చలికాలంలో అరకు అందాలు.. వెళ్తే ఈ ప్లేసెస్ మిస్ అవ్వకండి!
తమిళనాడుల కలకలం.. జైలు నుంచి తప్పించుకున్న 17 మంది ఖైదీలు..
తమిళనాడుల కలకలం.. జైలు నుంచి తప్పించుకున్న 17 మంది ఖైదీలు..
ఆ దెబ్బతో సినిమాలు మానేసి హిమాలయాలకు వెళ్లిపోవాలనుకున్నా..
ఆ దెబ్బతో సినిమాలు మానేసి హిమాలయాలకు వెళ్లిపోవాలనుకున్నా..
ధోనీని దాటేసిన తిలక్ వర్మ..ఛేజింగ్‌లో అదరగొట్టిన యంగ్‌స్టర్
ధోనీని దాటేసిన తిలక్ వర్మ..ఛేజింగ్‌లో అదరగొట్టిన యంగ్‌స్టర్
భర్త వైద్య చికిత్స కోసం దొంగతనాలు.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌
భర్త వైద్య చికిత్స కోసం దొంగతనాలు.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌