Hyderabad: హైదరాబాద్ ప్రజలకు అదిరిపోయే సూపర్ న్యూస్.. సిటీ బస్సుల కోసం కొత్త వ్యవస్థ.. ఇక రయ్.. రయ్..

తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌లో ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపర్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా మెట్రో తరహాలోనే సిటీ బస్సుల కోసం ప్రత్యేక కారిడార్‌ను నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్దం చేస్తోంది. దీని వల్ల సిటీలో రవాణా మెరుగుపడుతుంది.

Hyderabad: హైదరాబాద్ ప్రజలకు అదిరిపోయే సూపర్ న్యూస్.. సిటీ బస్సుల కోసం కొత్త వ్యవస్థ..  ఇక రయ్.. రయ్..
Tgsrtc

Updated on: Jun 06, 2026 | 4:13 PM

హైదరాబాద్‌లో మెట్రో సేవలు అందుబాటులో ఉ..న్నా ట్రాఫిక్ మాత్రం తగ్గడం లేదు. నగరంలో జనాభా పెరుగుతుండటంతో వాహనాల వల్ల ట్రాఫిక్ రద్దీ మరింత పెరుగుతోంది. సిగ్నల్స్ వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోతున్నాయి. ఉదయం, సాయంత్రం వేళల్లో ట్రాఫిక్ రద్దీ మరింత ఎక్కువగా ఉంటుంది. దీంతో ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకు ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది. కొత్త ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు నిర్మించడంతో పాటు మెట్రో విస్తరణ కూడా చేపడుతోంది. ఈ క్రమంలో శాశ్వతంగా ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ట్రాఫిక్ రద్దీ వల్ల ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించాలంటే ఎక్కువ సమయం పడుతుంది. దీంతో టీజీఎస్‌ఆర్టీసీ సేవలను మరింత మెరుగుపర్చేందుకు కొత్త నిర్ణయానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.

బీర్టీఎస్ వ్యవస్థ ఏర్పాటు

మెట్రో తరహాలోనే హైదరాబాద్‌లో సిటీ బస్సుల కోసం ప్రత్యేకంగా బస్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్(బీఆర్టీఎస్) ఏర్పాటు చేసేందుకు అధికారులు సిద్దం చేస్తున్నారు. బీఆర్టీఎస్ అంటే.. మెట్రో తరహాలో బస్సుల కోసం ప్రత్యేక కారిడార్లు ఉంటాయి. ఈ కారిడార్లలో కేవలం సిటీ బస్సులు మాత్రమే ప్రయాణిస్తాయి. ఇతర వ్యక్తిగత వాహనాలు ఈ కారిడార్ నుంచి వెళ్లేందుకు అనుమతి ఉండదు. అలాగే ఫ్లాట్‌ఫామ్‌పైనే ముందుగా ప్రయాణికులు టికెట్లు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. దీని వల్ల బస్సు లోపల సమయం ఆదా అవుతుంది. కూడళ్ల వద్ద ప్రత్యేక ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థతో బస్సులకు ప్రాధాన్యత ఇచ్చేలా అనుసంధానం చేస్తారు. దీని వల్ల బస్సులు ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆగకుండా వెళతాయి. దీని వల్ల ప్రయాణికులకు ట్రాఫిక్ రద్దీ లేని ప్రయాణ సౌకర్య తగ్గడంతో పాటు వేగంగా గమ్యస్థానానికి చేరుకోవచ్చు.

దేశాల్లోని చాలా నగరాల్లో..

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అనేక సిటీలలో ఇలాంటి తరహా వ్యవస్థ అందుబాటులో ఉంటుంది. అక్కడ ఈ ప్రాజెక్టులు విజయవంతమయ్యాయి. హైదరాబాద్ అంతర్జాతీయ నగరంగా రూపుదిద్దుకుంటోంది. నగరంలో జనాభా కూడా రోజురోజుకి పెరిగిపోతుంది. దీంతో జనాభాకు తగ్గట్లు ప్రజా రవాణా వ్యవస్థను వేగవంతం చేసే చర్యలను ప్రభుత్వం చేపట్టింది. ఇండియాలో ఇప్పటికే పుణె, అహ్మదాబాద్‌లో ఇలాంటి వ్యవస్థ అందుబాటులో ఉంది. వీటి ఏర్పాటు కోసం ఖర్చు కూడా చాలా తక్కువగా పడుతుంది. దీంతో ప్రభుత్వ ఆదేశాలతో ఇప్పటికే అధికారులు బీఆర్టీఎస్ వ్యవస్థ ఏర్పాటు కోసం పరిశీలన చేపడుతున్నారు. సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తుండగా.. అనంతరం ప్రభుత్వానికి నివేదించనున్నారు.  దీని వల్ల సిటీ బస్సుల్లో ప్రయాణించేవారికి ఊరట కలగనుంది. అంతేకాకుండా బస్సులకు ఇంధన వినియోగం కూడా తగ్గుతుంది.

Follow Us