
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు అధికారులు సైతం అన్ని విధాలుగా సన్నద్ధమవుతున్నారు. పోలింగ్ స్టేషన్ల రేషనలైజేషన్‌పై రాజకీయ పార్టీలతో జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ సమావేశం నిర్వహించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలో ఇప్పటివరకు ఉన్న 329 పోలింగ్ స్టేషన్ల స్థానంలో 408 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తామన్నారు. అదనంగా 79 కొత్త పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు కాబోతున్నాయి. రేషనలైజేషన్ నివేదికను రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంపనున్నారు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారులు.
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం 329 పోలింగ్ స్టేషన్లకు బూత్ లెవెల్ అధికారులు అందుబాటులో ఉన్నారు. అయితే కొన్ని రాజకీయ పార్టీలు మాత్రమే బూత్ లెవెల్ ఏజెంట్ల జాబితా సమర్పించాయి. ఇంకా ఇవ్వని పార్టీలు వెంటనే జాబితా అందజేయాలని కోరారు. కొత్తగా ఏర్పాటు చేసిన 79 పోలింగ్ స్టేషన్లకు బూత్ లెవెల్ అధికారులను త్వరలోనే నియామకం చేయనుంది ఈసీ. ఇక.. జూబ్లీహిల్స్‌లో జనవరి 6 నుంచి ఆగస్టు 15 వరకు 19వేల 237 మంది ఓటు నమోదుకు దరఖాస్తులు చేసుకున్నారు. అందులో 3వేల 767 తిరస్కరణకు గురయ్యాయి. మిగిలినవి పెండింగ్‌లో ఉన్నాయి.
జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నికకు సంబంధించి ముందస్తు ఏర్పాట్లను చేసేందుకు నోడల్ అధికారులను నియమిస్తూ జిల్లా ఎన్నికల అధికారి కర్ణన్ ఆదేశాలు జారీ చేశారు. ఒక్కో డిపార్ట్మెంట్‌కు ఒక స్పెషల్ ఆఫీసర్‌ను నియమిస్తూ ఉప ఎన్నిక ఏర్పాట్లను వేగవంతం చేశారు జిల్లా ఎన్నికల అధికారులు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..