
హైదరాబాద్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. ఖైరతాబాద్ పెద్ద గణేష్ వెనుక భాగంలో శ్రీనివాస్ నగర్ లో ఓ చిన్నారిపై వీధి కుక్క దాడి చేసింది. ఇంటి ముందు అడుకుంటుడగా ఒక్కసారిగా దూసుకొచ్చిన కుక్క బాలికపై విరుచుకుపడింది. గమనించిన స్థానికులు కేకలు వేయడంతో అక్కడి నుంచి పారిపోయింది. కుక్కదాడిలో బాలిక తీవ్రంగా గాయపడగా.. స్థానికులు చిన్నారిని హస్పిటల్‌కు తరలించారు.
హైదరాబాద్ లో వీధి కుక్కల స్వైర విహారం కొనసాగుతోంది. చిన్నారులే టార్గెట్ గా శునకాలు దాడులు చేస్తున్నాయి. ఇలాంటి ఘటనలు రోజూ ఎక్కడో అక్కడ దర్శనమిస్తునే ఉన్నాయి. తాజాగా ఈ రోజు ఉదయం 10:30 గంటలకు ఖైరతాబాద్ పెద్ద గణేష్ వెనుక భాగంలో ఉన్న శ్రీనివాస్ నగర్ లో ఓ చిన్నారిపై వీధి కుక్క దాడి చేసింది తీవ్రంగా గాయపర్చింది. ఇంటి ముందు అడుకుంటుడగా ఒక్కసారిగా దూసుకొచ్చిన కుక్క ఐదు ఏళ్ల చిన్నారిపై దాడికి పాల్పడింది.
అటుగా వెళ్తున్న వాహనదారుడు గమనించి వెంటనే కుక్కను తరిమి వేయడంతో చిన్నారికి ప్రాణాపాయం తప్పింది. వీధి కుక్క దాడిలో చిన్నారి చెంపపై తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో చిన్నారిని వెంటనే బంజారాహిల్స్ లోని రెయిన్‌బో ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. ప్రస్తుతం చిన్నారి ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. చిన్నారికి ప్రాణాపాయం ఏమి లేదని వైద్యులు వెల్లడించారు. చిన్నారి స్థానిక స్కూల్‌లో యూకేజీ చదువుతున్న శార్విగా గుర్తించారు.
వీడియో చూడండి..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.