Hyderabad: బ్రాండెడ్ సరుకు అని కుమ్మేస్తున్నారా..? అసలు విషయం తెలిస్తే బుర్ర పాడే!

నిత్యం ఆహారం, ఇతర నిత్యావసర వస్తువుల్లో కల్తీని చూస్తున్న ప్రజలకు, చివరకు మద్యం కూడా కల్తీ అవుతుందని విషయం తెలుసుకుని షాక్‌కు గురవుతున్నారు. హైదరాబాద్ లింగంపల్లి ప్రాంతంలో ఒక బార్‌లో అక్రమంగా మద్యాన్ని కల్తీ చేస్తూ అడ్డంగా బుక్ అయ్యారు. ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు చేసి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ ఘటన చాలా రోజుల నుండి జరుగుతున్న ఎక్సైజ్ పోలీసుల దాడితో వెలుగులోకి వచ్చింది.

Hyderabad: బ్రాండెడ్ సరుకు అని కుమ్మేస్తున్నారా..? అసలు విషయం తెలిస్తే బుర్ర పాడే!
Adulterating Alcohol

Edited By: Balaraju Goud

Updated on: Apr 25, 2025 | 6:44 PM

నిత్యం ఆహారం, ఇతర నిత్యావసర వస్తువుల్లో కల్తీని చూస్తున్న ప్రజలకు, చివరకు మద్యం కూడా కల్తీ అవుతుందని విషయం తెలుసుకుని షాక్‌కు గురవుతున్నారు. హైదరాబాద్ లింగంపల్లి ప్రాంతంలో ఒక బార్‌లో అక్రమంగా మద్యాన్ని కల్తీ చేస్తూ అడ్డంగా బుక్ అయ్యారు. ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు చేసి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ ఘటన చాలా రోజుల నుండి జరుగుతున్న ఎక్సైజ్ పోలీసుల దాడితో వెలుగులోకి వచ్చింది.

హైదరాబాద్ లింగంపల్లి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని అయ్యప్ప సొసైటీ ప్రాంతంలో ఉన్న ట్రూప్స్ బార్ లైసెన్స్ పునరుద్ధరణ జరగలేదు. అంతేకాకుండా, బార్ యజమానులు బకాయి ఉన్న ఫీజును కూడా చెల్లించలేదు. రంగారెడ్డి ఎక్సైజ్ సూపరిండెంట్ జీవన్ కిరణ్ అధ్యర్యంలో అబ్కారీ సిబ్బంది బార్‌లో తనిఖీలు నిర్వహించారు. తనిఖీల సమయంలో బార్‌లో ఖరీదైన మద్యం బాటిళ్ల సీల్స్‌ను తొలగించి, వాటిలో తక్కువ ధర కలిగిన మద్యాన్ని కలుపుతూ ఉండగా అధికారులు పట్టుకునర్నారు. ఇందుకు సంబంధించి కూకట్‌పల్లికి చెందిన సత్యనారాయణ, పునిక్ పట్నాయక్ అనే ఇద్దరు వ్యక్తులను పట్టుకున్నారు. రూ. 2,690 ధర కలిగిన జెమ్‌సన్ బ్రాండీ బాటిల్‌లో రూ. 1,000 ధర కలిగిన ఓక్స్‌మిత్ బ్రాండీని కలుపుతూ ఉండగా దొరికిపోయారు.

తనిఖీలు నిర్వహించిన అబ్కారీ అధికారులు బార్‌లో కల్తీ చేయడానికి సిద్ధంగా ఉంచిన తక్కువ ధర కలిగిన మరో 75 బాటిళ్ల మద్యాన్ని, 55 ఖాళీ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ప్రాథమిక విచారణలో గత కొంతకాలంగా ట్రూప్స్ బార్ యజమానులు లైసెన్స్ ఫీజు చెల్లించలేదని, అలాగే మద్యం డిపోల నుండి నేరుగా మద్యం తీసుకోవడం లేదని తేలింది. ఇతర మద్యం దుకాణాల నుండి తక్కువ ధరలకు మద్యం కొనుగోలు చేసి, అధిక ధర కలిగిన బాటిళ్లలో నింపి విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని విచారణలో వెల్లడైంది.

మొత్తం 1.48 లక్షల విలువైన మద్యం బాటిళ్లను ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బార్ లైసెన్స్ యజమాని ఉదయ్ కుమార్ రెడ్డి, మేనేజర్ వి. సత్యనారాయణ రెడ్డి, బార్‌లో పనిచేస్తున్న ఉద్యోగి పునిత్ పట్నాయక్‌లపై కేసు నమోదు చేశారు. నిందితులను, మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని లింగంపల్లి ఎక్సైజ్ స్టేషన్‌కు అప్పగించారు ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ టీమ్. ఈ కల్తీ మద్యం వ్యవహారాన్ని ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందంలో ఏఈఎస్ జీవన్‌ కిరణ్‌ బృందం ఛేదించింది. మిక్సింగ్ మద్యం బాటిళ్ల కేసును సమర్థవంతంగా ఛేదించిన ఎన్‌ఫోర్స్‌మెంట్ టీమ్‌ను ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ వి.బి. కమలాసన్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. ఈ ఘటన మద్యం విక్రయాలలో జరుగుతున్న అక్రమాలను వెలికితీసి, కఠిన చర్యలు తీసుకోవడానికి ఎక్సైజ్ శాఖ చేస్తున్న ప్రయత్నాలకు నిదర్శనంగా నిలుస్తోంది.

వీడియో చూడండి.. 

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..