AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: 50 ఏళ్ల కాలం కరిగినా.. స్నేహం చెదరలే..

వారంతా మనవళ్లు, మనవరాళ్లతో కాలం వెళ్లదీస్తున్నారు. రామా .. కృష్ణా .. అంటూ గడుపుతున్నారు. కొందరు షష్టిపూర్తి కూడా జరుపుకున్నారు. అయినా వారి స్నేహం చెదిరిపోలేదు. ఈ వయస్సులో వాళ్లంతా విద్యార్థులుగా మారిపోయారు. వీరంతా అపూర్వ సమ్మేళనం ద్వారా కలుసుకున్నారు. ..

Telangana: 50 ఏళ్ల కాలం కరిగినా.. స్నేహం చెదరలే..
50 Years Reunion
M Revan Reddy
| Edited By: |

Updated on: Feb 03, 2026 | 4:53 PM

Share

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు ఎంతో చరిత్ర ఉంది. ఇక్కడ చదివిన వారు ఉన్నత శిఖరాలకు చేరుకున్నారు. ఈ పాఠశాలలో 1974- 75లో పదో తరగతి చదివిన విద్యార్థులు 50 ఏళ్ల తర్వాత మళ్లీ కలుసుకున్నారు. మనవళ్లు, మనవరాళ్లతో గడిపే వారంతా ఈ స్వర్ణోత్సవ సమ్మేళనంలో స్నేహ మాధుర్యంలో మునిగిపోయారు. అందరూ స్వీయ పరిచయాలు, చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు.

50 ఏళ్లతరువాత మళ్లీ ఒకే వేదికపైకిరావడంతో బాల్య స్నేహితులందరూ ఆనాటి జ్ఞాపకాలను తలచుకొని భావోద్వేగానికి లోనయ్యారు.పాఠశాల తరగతి గదులు, ఉపాధ్యాయుల అనుభవాలు, విద్యార్థి జీవితంలోని మధుర క్షణాలను ఒక్కొక్కటిగా గుర్తు చేసుకున్నారు. హోదాలు, బాధ్యతలను పక్కనబెట్టి మళ్లీ విద్యార్థులుగా మారిన ఆ మధుర క్షణాలు సమ్మేళానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఒక్కటే నవ్వులు, కన్నీళ్లు, ఆనందం కలసి ఈ సమావేశాన్ని మరపురాని జ్ఞాపకంగా మార్చాయి. ఆ ప్రాంగణమంతా కోలాహలంగా మారి పండగ వాతావరణాన్ని తలపించింది. అందరూ సెల్ఫీలు దిగుతూ ఒకరినొకరు పలకరించుకుంటూ నాటి మిత్రులతో సరదాగా గడిపారు. ఈ కార్యక్రమంలో చింతలపూడి విద్యాకర్, బరిగల వీరయ్య, జక్కుల వెంకటేశ్వర్లు, లక్కాకుల వెంకటకృష్ణ, సురేందర్, బార్ వెంకటేశ్వర్లు, వేటూరి మధు, హరికిషన్, సత్యనారాయణ, ఎస్. రవికుమార్, అద్దంకి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. నాటి గురువులు అరవపల్లి రంగారావు, అంకతి అప్పయ్య, నారాయణం రఘునాథ్, వెంకటేశ్వరశాస్త్రి, సత్తయ్య, మంగయ్యలను సన్మానించుకున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
పరోటా మంచిగా దాబా స్టైల్ రావాలంటే ఇలా చేయండి...
పరోటా మంచిగా దాబా స్టైల్ రావాలంటే ఇలా చేయండి...
హారతిని 3, 5, 7 వంటి బేసి సంఖ్యలతోనే ఎందుకు ఇస్తారు? దీని వెనుక..
హారతిని 3, 5, 7 వంటి బేసి సంఖ్యలతోనే ఎందుకు ఇస్తారు? దీని వెనుక..
తండ్రి కొత్త మొబైల్ కొనివ్వలేదని... కొడుకు ఆత్మహత్య
తండ్రి కొత్త మొబైల్ కొనివ్వలేదని... కొడుకు ఆత్మహత్య
యూపీఐ ట్రాన్సాక్షన్లకు ఛార్జీలు.. లైన్ క్లియర్ అయింది..
యూపీఐ ట్రాన్సాక్షన్లకు ఛార్జీలు.. లైన్ క్లియర్ అయింది..
వాహనదారులకు బిగ్‌ అలర్ట్.. ఇకపై అలా చేస్తే కేసులే
వాహనదారులకు బిగ్‌ అలర్ట్.. ఇకపై అలా చేస్తే కేసులే
యూపీఐ లావాదేవీ ఫెయిల్ అయినా అకౌంట్లో డబ్బులు కట్ అయ్యాయా..?
యూపీఐ లావాదేవీ ఫెయిల్ అయినా అకౌంట్లో డబ్బులు కట్ అయ్యాయా..?
పొలం గట్లపై రైతుకు కనిపించిన వింత గుర్తులు.. ఏంటని ఆరా తీయగా
పొలం గట్లపై రైతుకు కనిపించిన వింత గుర్తులు.. ఏంటని ఆరా తీయగా
తక్కువ ఖర్చులో విరాట్ కోహ్లీ డైట్‌ ఫాలో అవ్వొచ్చు!
తక్కువ ఖర్చులో విరాట్ కోహ్లీ డైట్‌ ఫాలో అవ్వొచ్చు!
చెవిలో వెంట్రుకలు ఉండే వ్యక్తి నిజ స్వరూపం ఇదే.. షాకింగ్ సీక్రెట్
చెవిలో వెంట్రుకలు ఉండే వ్యక్తి నిజ స్వరూపం ఇదే.. షాకింగ్ సీక్రెట్
నాన్‌వెజ్ మాత్రమే కాదు.. శ్రావణమాసంలో ఈ ఆకు కూరలు కూడా తినొద్దట!
నాన్‌వెజ్ మాత్రమే కాదు.. శ్రావణమాసంలో ఈ ఆకు కూరలు కూడా తినొద్దట!
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర