విదేశాలకు మనుషుల అక్రమ రవాణా ముఠా అరెస్ట్

మనుషులను విదేశాలకు అక్రమంగా రవాణా చేస్తున్న అంతర్జాతీయ ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. మొత్తం 18 మంది ముఠాను అదుపులోకి తీసుకున్నారు. ఫేక్ పాస్‌పోర్టులతో వీరిని విదేశాలకు పంపిస్తున్నట్లు సైబరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. అరెస్ట్ చేసిన వారిలో కానిస్టేబుల్ మధు కూడా ఉన్నట్టు తెలిపారు. నకిలీ విదేశీ వీసాలు స‌ృష్టించి మోసాలు చేస్తున్నట్లు తెలిపారు సీపీ సజ్జనార్. దేశవ్యాప్తంగా ఈ ముఠా తమ కార్యకలాపాలు కొనసాగిస్తోందన్నారు. ముంబైలోని ఓ రిజిస్టర్ ఏజెంట్‌తో లింకులున్నాయి. అరెస్టైన […]

విదేశాలకు మనుషుల అక్రమ రవాణా ముఠా అరెస్ట్

Edited By:

Updated on: Mar 21, 2019 | 12:58 PM

మనుషులను విదేశాలకు అక్రమంగా రవాణా చేస్తున్న అంతర్జాతీయ ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. మొత్తం 18 మంది ముఠాను అదుపులోకి తీసుకున్నారు. ఫేక్ పాస్‌పోర్టులతో వీరిని విదేశాలకు పంపిస్తున్నట్లు సైబరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. అరెస్ట్ చేసిన వారిలో కానిస్టేబుల్ మధు కూడా ఉన్నట్టు తెలిపారు. నకిలీ విదేశీ వీసాలు స‌ృష్టించి మోసాలు చేస్తున్నట్లు తెలిపారు సీపీ సజ్జనార్. దేశవ్యాప్తంగా ఈ ముఠా తమ కార్యకలాపాలు కొనసాగిస్తోందన్నారు. ముంబైలోని ఓ రిజిస్టర్ ఏజెంట్‌తో లింకులున్నాయి. అరెస్టైన వారిలో కడప, నెల్లూరు, కృష్ణా, పశ్చిమగోదావరి, చిత్తూరు జిల్లాలకు చెందిన వారున్నారని తెలిపారు.

అరెస్టైన వారి వద్ద నుంచి 250 పాస్‌పోర్టులు, 38 సెల్‌ఫోన్లు, 5 లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నామని సీపీ సజ్జనార్ తెలిపారు. ఈ ముఠాకు కానిస్టేబుల్ మధు సహకరించారని తెలిపారు సీపీ. చేవెళ్ల నుంచి క్లియరెన్స్ సర్టిఫికెట్లు ఇప్పించి మనుషులను విదేశాలకు తరలిస్తున్నట్లుగా విచారణలో తేలిందన్నారు సీపీ.