పండక్కి సొంతూర్లకు వెళ్లిన జనం తిరిగి నగరానికి పయనం.. విజయవాడ-హైదరాబాద్ హైవేపై భారీ ట్రాఫిక్ జామ్

|

Jan 17, 2021 | 7:52 PM

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా బంధుమిత్రులతో ఆనందోత్సాహాల మధ్య జరుపుకునే సంక్రాంతి పండుగ ముగిసింది. వీకెండ్ కూడా వచ్చేసింది. ఈ క్రమంలో సొంతూర్లకు వెళ్లిన హైదరాబాద్ నగరవాసులు, ఉద్యోగులు

పండక్కి సొంతూర్లకు వెళ్లిన జనం తిరిగి నగరానికి పయనం.. విజయవాడ-హైదరాబాద్ హైవేపై భారీ ట్రాఫిక్ జామ్
Follow us on

Heavy Traffic Jam: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా బంధుమిత్రులతో ఆనందోత్సాహాల మధ్య జరుపుకునే సంక్రాంతి పండుగ ముగిసింది. వీకెండ్ కూడా వచ్చేసింది. ఈ క్రమంలో సొంతూర్లకు వెళ్లిన హైదరాబాద్ నగరవాసులు, ఉద్యోగులు తిరిగి సిటీకి పయనమయ్యరు. సోమవారం నుంచి ఆఫీసులు ప్రారంభమవుతాయి. ఈ క్రమంలో అందరూ ఆదివారం సాయంత్రం పిండివంటలను దండిగా క్యాన్లు, బ్యాగులకు సర్దుకుని రోడెక్కారు. ఈ క్రమంలో టోల్ ప్లాజాల వద్ద ట్రాఫిక్ విపరీతంగా పెరిగింది.

విజయవాడ నుండి హైదరాబాద్ కు వెళ్లే హైవే వైపుకు రెండుకిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. కేతేపల్లి మండలం కొర్లపహాడ్ టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ అధికంగా ఉండటంతో ప్రయాణీకులు ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. చాలావరకు వాహనాలకు ఫాస్టాగ్ ఉన్నప్పటికీ రద్దీ అధికంగానే ఉంది. రేపు ఉదయం వరకు ఇదే తరహా రద్దీ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. పోలీసులు ట్రాఫిక్ నియంత్రించే ప్రయత్నం చేస్తున్నారు.