Telangana: తెలంగాణ ప్రజలకు సూపర్ ఛాన్స్.. వీరికి ఒక్కొక్కరికీ రూ.లక్ష సాయం.. దరఖాస్తు ఎలా చేయాలంటే..?

తెలంగాణ ప్రభుత్వం కళ్యాణ లక్షి పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది. ఈ పథకం ద్వారా సామాన్య, మధ్యతరగతి వర్గాల్లోని పెళ్లి చేసుకునే అమ్మాయిలకు ఆర్ధిక సాయం అందిస్తోంది. దీనికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి అనే విషయం చాలామందికి తెలియదు. ఆ విషయాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

Telangana: తెలంగాణ ప్రజలకు సూపర్ ఛాన్స్.. వీరికి ఒక్కొక్కరికీ రూ.లక్ష సాయం.. దరఖాస్తు ఎలా చేయాలంటే..?
Money

Updated on: Feb 10, 2026 | 4:22 PM

Kalyana Lakshmi: ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు అంటారు పెద్దలు. సామాన్య, మధ్యతరగతి ప్రజలకు ఆ రెండు పనులు అత్యంత భారంతో కూడుకున్నవి. అప్పటివరకు కూడబెట్టుకున్న సొమ్మునంతా వీటి కోసం ఖర్చు చేయాల్సి ఉంటుంది. లక్షలకు లక్షలకు ఖర్చు పెట్టి పెళ్లిని అత్యంత గ్రాండ్‌గా చేసుకోవాలని చాలామంది ఆశ పడుతూ ఉంటారు. కానీ పెళ్లి అంటేనే అత్యంత ఖర్చుతో కడుకున్న వ్యవహారం. దీంతో పెళ్లి అంటేనే సామాన్య, మధ్యతరగతి ప్రజలు భయపడుతూ ఉంటారు. దీంతో పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు ఆర్ధిక సాయం చేయాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం కళ్యాణ్ లక్ష్మి పథకాన్ని ఎప్పటినుంచో అమలు చేస్తోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ పథకాన్ని మొదలుపెట్టగా.. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కొనసాగిస్తోంది. ఈ పథకం ద్వారా పెళ్లి చేసుకునే ఆడ పిల్లలకు రూ.లక్ష సాయం అందిస్తోంది. వీటిని నేరుగా లబ్దిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తోంది. ఈ పథకానికి ఎలా అప్లై చేసుకోవాలి..? అర్హతలు ఏంటి..? ఏయే డాక్యుమెంట్స్ అందించాలి? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.

అర్హతలు ఇవే..

-తెలంగాణ వాసి అయి ఉండాలి
-కనీసం వధువుకి 18 ఏళ్ల వయస్సు నిండి ఉండాలి
-వరుడికి 21 ఏళ్ల వయస్సు నిండి ఉండాలి
-కుటుంబ వార్షిక ఆదాయం రూ.2 లక్షల్లోపు ఉండాలి

దరఖాస్తు కోసం కావాల్సిన పత్రాలు

-వధువు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్

-వధువుతో పాటు తల్లి బ్యాంక్ అకౌంట్ వివరాలు

-వధువు ఫొటో

-ఆధార్ కార్డు

దరఖాస్తు చేసుకోవడం ఎలా..?

-telanganaepass.cgg.gov.in వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయండి

-హోమ్ పేజీలో కళ్యాణ్ లక్ష్మి అనే ఆప్షన్ ఎంచుకోండి

-కళ్యాణ్ లక్ష్మి రిజిస్ట్రేషన్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి

-వివరాలు, ఆదాయం, కులం, అడ్రస్, బ్యాంక్ వివరాలు నమోదు చేయండి

-వరుడి వయస్సు పొందుపర్చండి

-డాక్యుమెంట్లను స్కాన్ చేసి అప్‌లోడ్ చేయండి

-సబ్మిట్‌పై క్లిక్ చేసి అప్లికేషన్‌ను ప్రాసెస్ చేయండి

-అనంతరం మీ రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది

స్టేటస్ చెక్ చేసుకోవడమెలా..?

-telanganaepass.cgg.gov.in పోర్టల్ ఓపెన్ చేయండి

-కళ్యాణ లక్ష్మి ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోండి

-రిజిస్ట్రేషన్ ఆప్షన్ కింద కనిపించే స్టేటస్ అనే ట్యాబ్‌ను సెలక్ట్ చేసుకోండి

-ఆధార్ కార్డుతో పాటు మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి

-మీ అప్లికేషన్ స్టేటస్ తెలుస్తుంది

-అధికారులు దరఖాస్తు వివరాలు పరిశీలించి నిర్ధారిస్తారు

-మీరు నిజమైన లబ్దిదారులు అయితే రూ.లక్ష విడతల వారీగా బ్యాంక్ అకౌంట్లో జమ చేస్తారు

-దరఖాస్తు చేసుకున్న అకౌంట్లో పడటానికి టైమ్ పడుతుంది