RS Praveen Kumar: చిచ్చు పెట్టాలని చూస్తున్నారు.. హమారా ప్రసాద్‌పై చర్యలు తీసుకోండి: ఆర్ఎస్‌ ప్రవీణ్‌

వాదం రగులుతోంది. వివాదం రాజుకుంది. అంబేద్కర్ భావజాలంపై చర్చ రచ్చగా మారింది. అంబేద్కరిజంపై హైందవం మండిపడుతోంది. అంబేద్కర్‌ను తప్పుబడుతారా? అంటూ దళిత సమాజం కౌంటర్ ఇస్తోంది.

RS Praveen Kumar: చిచ్చు పెట్టాలని చూస్తున్నారు.. హమారా ప్రసాద్‌పై చర్యలు తీసుకోండి: ఆర్ఎస్‌ ప్రవీణ్‌
Rs Praveen Kumar

Updated on: Feb 11, 2023 | 9:38 AM

వాదం రగులుతోంది. వివాదం రాజుకుంది. అంబేద్కర్ భావజాలంపై చర్చ రచ్చగా మారింది. అంబేద్కరిజంపై హైందవం మండిపడుతోంది. అంబేద్కర్‌ను తప్పుబడుతారా? అంటూ దళిత సమాజం కౌంటర్ ఇస్తోంది. ఈ వివాదం ఏంటి? దాని వెనుకున్న కాంట్రవర్సీ ఏంటి? ఇప్పుడే ఎందుకు ఇది చర్చకు దారితీసిందంటే.. హిందుత్వవాది హమారా ప్రసాద్‌ వ్యాఖ్యలే ఈ వివాదాన్ని రేపింది. ఈ వ్యాఖ్యలే దళిత సంఘాలకు ఆగ్రహం తెప్పించాయి. దేశానికి దిక్సూచిలా మారిన అంబేద్కర్‌నే తప్పుబడుతారా? ఆయన వాదాన్ని కించపరుస్తారా? అంటూ ప్రశ్నిస్తున్నాయి. ఆయన హిందూధర్మానికి ఏం చేయలేదన్నది హమారా ప్రసాద్ వ్యాఖ్యల సారాంశం.

దళిత సేన పేరుతో భారత రాజ్యాంగ రచయిత బాబా సాహేబ్ అంబేద్కర్ అనుచిత వ్యాఖ్యలు చేసిన హమారా ప్రసాద్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. హైదరాబాద్ అల్వాల్లోని ఆయన ఇంట్లో హమారా ప్రసాద్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. దళిత సేన పేరుతో యూట్యూబ్ క్రియేట్ చేసి అందులో అంబేద్కర్ రాసిన పుస్తకాలపై హమారా ప్రసాద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వీడియోలను విడతల వారీగా అప్ లోడ్ చేశారు.

దీనిపై దళిత సంఘాలు, అంబేద్కర్ సంఘాలు తీవ్రంగా ఖండించాయి. అంబేద్కర్ కాలంలో తాను జీవించి ఉంటే అతన్ని చంపేసేవాడినంటూ హమారా ప్రసాద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంపై మండిపడ్డారు బీఎస్పీ తెలంగాణా చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఆర్ఎస్ఎస్ అండదండలతోనే ప్రసాద్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళిత సేన అనే ఫేక్ సంస్థను క్రియేట్ చేసి ఘోరమైన ఆరోపణలు చేస్తూ సభ్యసమాజం తలదించుకునేలా, తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బేతీసేలా మాట్లాడుతున్నారని విమర్శించారు. అంబేద్కర్ జపం చేసే తెలంగాణ ప్రభుత్వం ఇలాంటి వారిని ఎందుకు ఉపేక్షిస్తుందని ప్రశ్నించారు.

ఇవి కూడా చదవండి

వ్యక్తిగత క్రమశిక్షణ కోసం భక్తి మాలలు వేసే వారిని కొన్ని శక్తులు దాడుల కోసం ప్రేరేపిస్తున్నాయని విమర్శించారు ప్రవీణ్ కుమార్. ప్రశాంతంగా ఉన్న తెలంగాణాలో మతకల్లోల పేరుతో కొన్ని దుష్ట శక్తులు చిచ్చు పెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..