హైదరాబాద్ మహానగరంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మంగళ్‌హాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ విషాదం వెలుగు చూసింది. వెక్కిళ్లు ఓ పూజారి నిండు ప్రాణాలను బలి తీసుకున్నాయి. ఆకస్మాత్తుగా వచ్చిన వెక్కిళ్లతో పూజారి ప్రాణాలు కోల్పోయాడు. ఈ హఠాత్తు పరిణామంతో అంతా ఒక్కసారి నిశ్చేష్టులయ్యారు. అక్కడున్న వారు వెంటనే స్పందించిన ఫలితం లేకుండాపోయింది.
మృత్యువు ఏ రూపంలో వస్తుందో ఎవరూ ఊహించలేరు. ఈ భూమ్మీద నూకలు చెల్లాలే కానీ, ఎలాగైనా ప్రాణాలు కోల్పోతారనడానికి తాజాగా జరిగిన ఘటనే ఇందుకు ఉదాహరణ. అప్పటి వరకు సరదాగా.. గడిపిన వారు కూడా క్షణాల్లో లోకాన్ని విడచి వారి కుటుంబ సభ్యులకు తీరని శోకాన్ని మిగులుస్తారు. ఇటీవల కాలంలో అటువంటి ఘటనలు అనేకం. తాజాగా హైదరాబాద్‌లో అటువంటే ఘటనే చోటు చేసుకుంది. వెక్కిళ్లతో ఓ పూజారి ఆకస్మికంగా మృతి చెందాడు.
మధ్య ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సునీల్ కుమార్ (33) బతుకు దెరువు కోసం హైదరాబాద్ వలస వచ్చాడు. మంగళహాట్ పరిధిలోని జింగార్ బస్తీలో సోదరి కుటుంబంతో కలిసి నివాస ఉంటున్నాడు. తన బావతో కలిసి పూజలు చేస్తూ పూజారిగా జీవనం సాగిస్తున్నాడు. అయితే ఫిబ్రవరి 19 సాయంత్రం ఉన్నట్లుండి ఒక్కసారిగా వెక్కిళ్లు వచ్చాయి. ఎంతకి వెక్కిళ్లు ఆగకపోవటంతో నీరు త్రాగాడు. అయినా ఫలితం లేకపోగా.. కాసేపటికే అతడు స్పృహతప్పి పడిపోయాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే అతడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే అతను ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు. దీంతో కుటుంబం సభ్యులు షాక్‌కు గురయ్యారు. ఇంటి పెద్ద కోల్పోయి భోరున విలపిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…