ఒకవైపు మంచు.. మరోవైపు చలితో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు తెలుగు రాష్ట్రాల ప్రజలు. మునుపెన్నడూ లేనివిధంగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రానున్న రోజుల్లో చలి మరింత పెరగనుందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. మరో వారం రోజుల పాటు వాతావరణం డ్రైగానే ఉంటుందని ప్రకటించారు. వాతావరణపరిస్థితుల్లో మార్పుల దృష్ట్యా.. ప్రస్తుత సీజన్ లో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలంగాణ ఆరోగ్యశాఖ హెల్త్ అడ్వైజరీ జారీ చేసింది.
తెలంగాణలో చలి తీవ్రత పెరుగుతోంది. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు తగ్గిపోతున్నాయి. రానున్న రోజుల్లో మరింత తగ్గే అవకాశముంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం హెల్త్ అడ్వైజరీ జారీ చేసింది. కోల్డ్ వేవ్ నేపథ్యంలో పబ్లిక్ హెల్త్ అడ్వైజరీ జారీ చేశారు. వృద్ధులు, చిన్నారులు, గర్భిణులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..