Hens Died: అంతుచిక్కని వ్యాధితో మృత్యువాత పడిన కోళ్లు.. తీవ్ర స్థాయిలో నష్టపోయిన రైతు

Hens Died: ఓ వైపు గత కొన్ని రోజులుగా చికెన్ ధర(Chicken Price) పై పైకి ఎగసిపోతూ కొనుగోళ్లు తగ్గి పౌల్ట్రీ యజమానులకు షాక్ ఇస్తుంటే..  మరోవైపు వరంగల్ జిల్లా(Warangal district)) లో అంతుచిక్కని వ్యాధితో కోళ్లు..

Hens Died: అంతుచిక్కని వ్యాధితో మృత్యువాత పడిన కోళ్లు.. తీవ్ర స్థాయిలో నష్టపోయిన రైతు
Hens Died
Follow us
Surya Kala

|

Updated on: Mar 21, 2022 | 9:07 AM

Hens Died: ఓ వైపు గత కొన్ని రోజులుగా చికెన్ ధర(Chicken Price) పై పైకి ఎగసిపోతూ కొనుగోళ్లు తగ్గి పౌల్ట్రీ యజమానులకు షాక్ ఇస్తుంటే..  మరోవైపు వరంగల్ జిల్లా(Warangal district)) లో అంతుచిక్కని వ్యాధితో కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. దీంతో కోళ్ల పెంపకందారులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

జిల్లాలోని నెక్కొండ మండలం మడిపల్లి లోని ఓ పౌల్ట్రీ ఫామ్ లో వందల సంఖ్యలో కోళ్లు ఆకస్మాత్తుగా చనిపోయాయి. అంతు చిక్కని వ్యాధితో వందల సంఖ్యలో కోళ్లు మృతి చెందాయి. దీంతో పౌల్ట్రీ రైతు తీవ్ర స్థాయిలో నష్టపోయాడు. ఉపాధి కోసం కోళ్ళ పెంపకాన్ని చేపట్టిన తనకు లక్షల్లో నష్టం వచ్చిందంటూ ఆ రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. అయితే ఒక్కసారిగా కోళ్లు మరణించడంతో మరణానికి గల కారణాలు తెలుసుకోవడానికి వెటర్నరీ వైద్య సిబ్బందిని రంగం లోకి దిగారు. మరణించిన కోళ్లను పరిశీలిస్తున్నారు.

Also Read

Rajamouli: ఆ లక్షణం ఉంటే ఏ సినిమా అయినా సరిహద్దులు చెరిపేయగలదు.. పాన్‌ ఇండియా సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌.

Chanakya Niti: లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లపుడూ ఉండాలంటే.. ఈ విషయాలను పాటించమంటున్న చాణక్య