Rain Alert: ఏపీ, తెలంగాణలో మూడ్రోజుల పాటు భారీ వర్షాలు.. ఈ జిల్లాల ప్రజలకు హెచ్చరిక.. జాగ్రత్తగా ఉండండి..

ఏపీ, తెలంగాణకు వాతావరణశాఖ భారీ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. ఈ నెల 30వ తేదీ వరకు భారీ వర్షాలు పడతాయని తెలిపింది. పలు జిల్లాల్లో పిడుగులు పడే అవకాశముందని, అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఈ మేరకు పలు జిల్లాలకు భారీ రెయిన్ అలర్ట్ జారీ చేశారు.

Rain Alert: ఏపీ, తెలంగాణలో మూడ్రోజుల పాటు భారీ వర్షాలు.. ఈ జిల్లాల ప్రజలకు హెచ్చరిక.. జాగ్రత్తగా ఉండండి..
Rains

Updated on: Jun 26, 2026 | 7:20 AM

నైరుతి రుతుపవనాలు ఏపీలో విస్తరిస్తున్నాయి. దీని ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గురువారం పలు జిల్లాల్లో భారీ వానలు పడగా.. శుక్రవారం, శనివారం కూడా అమరావతి వాతావరణ కేంద్రం భారీ వర్షసూచన జారీ చేసింది. జూన్ 26వ తేదీన అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పోలవరం, పశ్చిమగోదావరి, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఇక మిగతా జిల్లాల్లో కూడా పిడుగులతో కూడిన వానలు కురిసే అవకాశముందని, పొలాల్లో ఉండే కూలీలు, రైతులు, పుశువుల కాపరులు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. వర్షాలు పడే సమయంలో సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలని పేర్కొంది.

ఏపీలో భారీ వర్షాలు

ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. నేడు ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది. గడిచిన 24 గంటల్లో పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబిల్లిలో 5.2 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదవ్వగా.. కృష్ణా జిల్లా గుడివాడలో 3.5 సె.మీ, పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురంలో 3.5 సె.మీ, పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో 3.3 సె.మీ, ఏలూరు జిల్లా భీమడోలులో 3 సె.మీల వర్షపాతం నమోదైనట్లు వెల్లడించింది. ఇక ఏలూరు జిల్లా కైకలూరులో 2.9 సెంటీమీటర్లు, విజయనగరంలో 2.7 సె.మీ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కొనసీమ జిల్లా అమలాపురంలో 2.6 సె.మీ, ఎన్టీఆర్ జిల్లా పాలేరు బ్రిడ్జి 2.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

తెలంగాణకు భారీ వర్షసూచన

ఇక రాయలసీమలో రాబోయే మూడ్రోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణశాఖ వెల్లడించింది. ఈదురుగాలులు 40-50 కిలోమీటర్ల వేగంతో వీస్తాయిని తెలిపింది. ఇక కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురవనుండగా.. మరికొన్ని ప్రాంతాల్లో ఎండ తీవ్రత కొనసాగనుంది. ఏపీపై కూడా ఎల్‌నివో ప్రభావం ఉంటుందని, పంటల సాగు విషయంలో ప్రత్యామ్నాయలను ఎంచుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అటు తెలంగాణలో రాబోయే మూడ్రోజుల పాటు భారీ వర్షాలకు ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది.  జూన్ 26,278వ తేదీల్లో మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని అంచనా వేసింది. ఇక  జూన్ 27,28వ తేదీల్లో ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో భారీ వానలు కురుస్తాయని తెిపింది.  ఇక జూన్ 28,29వ తేదీల విషయానికొస్తే.. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశముందని హెచ్చరించింది. పలు జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరిక జారీ చేసింది.

Follow Us