Pranay Murder case: ప్రణయ్ హత్య కేసు నిందితుడు అబ్దుల్ బారీకి గుండెపోటు.. నిమ్స్ ఆస్పత్రికి తరలింపు

|

Apr 02, 2022 | 10:04 AM

నల్గొండ జిల్లా మిర్యాలగూడ(Mirayalguda) లో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో నిందితుడు అబ్దుల్ బారీకి గుండెపోటు వచ్చింది. వెంటనే అప్రమత్తమైనజైలు అధికారులు అబ్దుల్ బారీ(Abdul bari) ని నిమ్స్ కు తరలించారు....

Pranay Murder case: ప్రణయ్ హత్య కేసు నిందితుడు అబ్దుల్ బారీకి గుండెపోటు.. నిమ్స్ ఆస్పత్రికి తరలింపు
Abdul Bari
Follow us on

నల్గొండ జిల్లా మిర్యాలగూడ(Mirayalguda) లో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో నిందితుడు అబ్దుల్ బారీకి గుండెపోటు వచ్చింది. వెంటనే అప్రమత్తమైనజైలు అధికారులు అబ్దుల్ బారీ(Abdul bari) ని నిమ్స్ కు తరలించారు. ప్రస్తుతం నల్గొండ జైలులో అబ్దుల్ బారీ శిక్ష అనుభవిస్తున్నాడు. ప్రణయ్ హత్య కేసు(Pranay Murder Case) లో అమృత తండ్రి మారుతీ రావుకు అబ్దుల్ బారీ సుపారీ గ్యాంగ్ ను సమకూర్చాడు. 2018 సెప్టెంబర్ లో ప్రణయ్ దారుణ హత్యకు గురయ్యాడు. 2020 మార్చిలో హైదరాబాద్ లో అమృత తండ్రి మారుతీరావు ఆత్మహత్య చేసుకున్నాడు.

న కూతురు అమృత ప్రేమ వివాహం చేసుకోవడంతో తట్టుకోలేని మారుతీరావు సుపారీ ఇచ్చి ప్రణయ్‌ను హత్య చేయించిన విషయం తెలిసిందే. ఈ కేసులో అమృత తండ్రి మారుతీరావు, ఆమె బాబాయి శ్రవణ్‌, ఎంఏ కరీం, అస్గర్‌అలీ, అబ్దుల్‌ బారీ, సుభాష్‌ శర్మలను పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలో ప్రణయ్ హత్య కేసు ప్రధాన నిందితుడు మారుతీరావు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హైదరాబాద్‌ ఖైరతాబాద్‌లోని ఆర్యవైశ్య భవన్‌లో విషం తాగి బలవన్మరణం చేసుకున్నాడు.

Also Read

CC footage Video: హర్యానాలో జనం పైకి దూసుకొచ్చిన ఆర్టీసీ బస్సు.. ఇద్దరు యువకులు ఎం చేసారంటే..?

Road Accident: నాగర్‌ కర్నూల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం..

Healthy Heart: ఛాతి నొప్పి మాత్రమే కాదు.. ఈ లక్షణాలు కూడా హార్ట్ స్ట్రోక్‌కు చిహ్నాలే.. అవేంటంటే..!