Health Tips: మొలకెత్తిన శనగలు తిన్న తర్వాత ఈ 5 పదార్థాలు అస్సలు తినకండి.. అవేంటంటే..

మొలకెత్తిన శెనగలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. మొలకెత్తిన శెనగల్లో పోషకాలు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. విటమిన్ సి కూడా ఇందులో పుష్కలంగా లభిస్తుంది. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. చాలా మంది వీటిని అల్పాహారంగా తీసుకోవడానికి ఇష్టపడతారు. అయితే బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకున్న తర్వాత కొన్నింటిని తినడం సరికాదని మీకు తెలుసా. మొలకెత్తిన శెనగలు తిన్న తర్వాత కొన్ని పదార్థాలు తినడం వల్ల సమస్యలు వస్తాయి. ప్రత్యేకించి అలర్జీ, కడుపు నొప్పి వంటి సమస్యలు..

Health Tips: మొలకెత్తిన శనగలు తిన్న తర్వాత ఈ 5 పదార్థాలు అస్సలు తినకండి.. అవేంటంటే..
Sprouts

Updated on: Sep 05, 2023 | 9:00 AM

మొలకెత్తిన శెనగలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. మొలకెత్తిన శెనగల్లో పోషకాలు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. విటమిన్ సి కూడా ఇందులో పుష్కలంగా లభిస్తుంది. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. చాలా మంది వీటిని అల్పాహారంగా తీసుకోవడానికి ఇష్టపడతారు. అయితే బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకున్న తర్వాత కొన్నింటిని తినడం సరికాదని మీకు తెలుసా. మొలకెత్తిన శెనగలు తిన్న తర్వాత కొన్ని పదార్థాలు తినడం వల్ల సమస్యలు వస్తాయి. ప్రత్యేకించి అలర్జీ, కడుపు నొప్పి వంటి సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మరి మొలకెత్తిన శెనగలు తిన్న తరువాత ఏం తినకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

పాలు తాగొద్దు..

మొలకెత్తిన గింజలు తిన్న తర్వాత.. కొంత సమయం వరకు (కనీసం 1-2 గంటలు) పాలు తాగకూడదు. తద్వారా మీ జీర్ణవ్యవస్థకు ప్రకృతిలోని పోషకాలతో సమతుల్య పద్ధతిలో ఆ పప్పులను జీర్ణం చేయడానికి సమయం ఉంటుంది. మొలకెత్తిన పప్పులో అధిక మొత్తంలో విటమిన్ సి ఉంటుంది. పాలలో ఉండే విటమిన్ సి, కాల్షియం శరీరంలో ఆక్సలేట్‌లను ఏర్పరుస్తాయి. ఆక్సలేట్స్ చర్మంపై అలెర్జీ ప్రతిచర్యను కలిగిస్తాయి. ఇది ముఖంపై దద్దుర్లు, మొటిమలు, ఎర్రటి దద్దుర్లు వంటి సమస్యలను కలిగిస్తుంది.

ఊరగాయలు తినవద్దు..

మొలకెత్తిన పప్పులో అధిక మొత్తంలో ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు ఉంటాయి. మరోవైపు, ఊరగాయలో ఎక్కువ ఉప్పు, వెనిగర్ ఉంటుంది. వీటిని కలిపి తీసుకోవడం వల్ల కడుపులో చికాకు, అసిడిటీ, అజీర్ణం వంటి సమస్యలు వస్తాయి. ఊరగాయ పుల్లని, ఉప్పు రుచి మొలకెత్తిన పప్పుల జీర్ణక్రియను అడ్డుకుంటుంది. అందుకే మొలకెత్తిన పప్పు తిన్న తర్వాత కనీసం 1-2 గంటల తర్వాత ఊరగాయ తినాలి.

గుడ్లు తినవద్దు..

మొలకెత్తిన పప్పుల్లో విటమిన్ కె, ప్రోటీన్లు ఉంటాయి. అయితే విటమిన్ డి, ప్రోటీన్ గుడ్లలోనూ ఉంటాయి. వీటి కలయిక వల్ల గ్యాస్, క్రాంప్స్, పొట్టలో భారం వంటి సమస్యలు వస్తాయి. కోడిగుడ్డులోని ప్రోటీన్ కంటెంట్ చిక్‌పీ మొలకల జీర్ణక్రియను తగ్గిస్తుంది.

కాకరకాయ తినవద్దు..

మొలకెత్తిన శెనగలో విటమిన్ కె, విటమిన్ సి ఉంటుంది. కాకరకాయలోనూ ఇవి ఉంటాయి. రెండు విటమిన్లు కలపడం వల్ల శరీరంలో ఆక్సలేట్ ఏర్పడుతుంది. ఇది హానికరం. ఇది మూత్రపిండాలపై అదనపు ఒత్తిడిని కలిగిస్తుంది. రాళ్ల ప్రమాదాన్ని పెంచుతుంది.

గమనిక: ఈ కథనంలో వివరాలు ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు. ఏవైనా అనారోగ్య సమస్యలుంటే వైద్యులను సంప్రదించడం ఉత్తమం.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..