తెలంగాణలో వైద్య వ్యవస్థ నిజంగా గొప్ప స్థాయిలో ఉందన్నది ప్రజల నుంచి వినిపిస్తున్న మాట. ఇందులో ప్రస్తుత వైద్యారాగ్య శాఖ మంత్రి హరీశ్ రావుకు సింహం భాగం పాత్ర దక్కుతుంది. గత హెల్త్ మినిస్టర్ ఈటలకు కూడా కొంత క్రెడిట్ ఇవ్వాల్సిందే. బస్తీ దవాఖాలు, అర్భర్ హెల్త్ సెంటర్లు, పెద్ద ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యం పేద ప్రజలకు అందిస్తున్నారు ప్రవేట్ ఆస్పత్రులకు వెళ్తే.. లక్షలు పోయాల్సిన శస్త్రచికిత్సలను కూడా సర్కారీ దవాఖానాల్లో ఉచితంగా చేస్తున్నారు. అంతేకాదు వివిధ రకాలు పరీక్షలు సైతం ఉచితంగానే చేస్తున్నారు. తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా 134 ఫ్రీ మెడికల్ టెస్టులు తెలంగాణ సర్కార్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ వైద్య పరీక్షలను మినిస్టర్ హరీశ్‌రావు వర్చువల్‌గా స్టార్ట్ చేశారు. తెలంగాణ డయాగ్నొస్టిక్స్ ద్వారా ఇప్పటివరకు 54 పరిక్షలు ఫ్రీగా చేసేవారు. తాజాగా 134 వైద్య పరీక్షలను అందుబాటులోకి తీసుకొచ్చారు.
డాక్టర్ సూచించిన టెస్టులకు శాంపిల్స్ ఇచ్చిన తర్వాత.. వాటి రిపోర్టులను రిపోర్టులను పేషెంట్, డాక్టర్ల సెల్ ఫోన్‌కు పంపిస్తారు. గవర్నమెంట్ హాస్పిటల్స్‌లో టిఫా స్కాన్, 2డి-ఎకో రేడియాలజీ ల్యాబ్‌లను కూడా ప్రవేశపెట్టారు. అంతేకాదు రాష్ట్ర వ్యాప్తంగా 16 రేడియాలజీ సెంటర్లు, 8 డయాగ్నొస్టిక్స్ సెంటర్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. ఈ సందర్భంగా వైద్యులను మంత్రి హరీశ్ ప్రశంసించారు. కరోనా సమయంలో సర్కారీ దవాఖానాల్లోని డాక్టర్లు చాలా కష్టపడ్డారని చెప్పారు. ప్రభుత్వ ఆస్పత్రులను కార్పొరేట్ స్థాయి ఆస్పత్రులకు దీటుగా మార్చి.. రాష్ట్రాన్ని ఆరోగ్య తెలంగాణగా మార్చారని అభినందించారు. గతంలో గవర్నమెంట్ హాస్పిటల్స్‌లో 30శాతం ప్రసవాలు జరిగితే.. ఇప్పుడు 70శాతం అవుతున్నాయని హరీశ్ రావు తెలిపారు. పేద ప్రజలకు నిమ్స్‌లో అత్యాధునిక వైద్యం అందిస్తున్నట్లు వివరించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..