Telangana: చెప్పేది బోటనీ పాఠాలు.. చేసేది బట్టేబాజ్ పనులు.. విద్యార్థినులతో..

కామారెడ్డిలో కీచక అధ్యాపకుడి బండారం బట్టబయలైంది. అమ్మాయిలకు వీడియోకాల్స్‌ చేస్తూ.. అసభ్యకర మెసేజ్‌లతో వేధిస్తోన్న ఓ లెక్చరర్‌ బాగోతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Telangana: చెప్పేది బోటనీ పాఠాలు.. చేసేది బట్టేబాజ్ పనులు.. విద్యార్థినులతో..
Herrassment

Updated on: Jan 31, 2023 | 9:52 AM

కామారెడ్డిలో కీచక అధ్యాపకుడి బండారం బట్టబయలైంది. అమ్మాయిలకు వీడియోకాల్స్‌ చేస్తూ.. అసభ్యకర మెసేజ్‌లతో వేధిస్తోన్న ఓ లెక్చరర్‌ బాగోతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కామారెడ్డి.. సదాశివనగర్‌ మండలం మోడల్ స్కూల్లో విద్యార్థినులపై గత చాలాకాలంగా లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు బోటనీ లెక్చరర్ నరేష్. సందేహాలు ఉంటే తనకు ఫోన్ చేయాలంటూ విద్యార్థినులకు కు ఫోన్ నెంబర్ ఇచ్చాడు. ఆ తర్వాత వారు ఫోన్ చేస్తే.. అలా విద్యార్థునుల నెంబర్లు సేవ్ చేసుకునేవాడు. అనంతరం అసభ్యకర మెసేజ్‌లతో లైంగిక వేధింపులకు తెగించాడు నరేష్‌. తాను చెప్పినట్టు చేయకపోతే మార్కులు కట్‌ చేస్తానంటూ బ్లాక్‌మెయిల్‌ కూడా చేయడం మొదలుపెట్టాడు. దీంతో విసిగిపోయిన విద్యార్థులు ఫిర్యాదు చేయడంతో నరేష్‌ అరాచకాలు వెలుగులోకి వచ్చాయి.

లెక్చరర్ నరేశ్ పై స్థానిక సదాశివనగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు ప్రిన్సిపల్ భానుమతి. లెక్చరర్ నరేష్ పై కేసు నమోదు చేశారు పోలీసులు. మరోవైపు కీచక లెక్చరర్ పై చర్యలు తీసుకోవాలంటూ కలెక్టర్ ఏవో కు వినతి పత్రం ఇచ్చారు ఏబీవీపీ విద్యార్థి సంఘ నాయకులు.

కాగా.. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. బోటనీ లెక్చరర్ పై చర్యలు తీసుకోవాలని విద్యార్థునులు, వారి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..

Loading...
Unable to load recommendations.
Follow Us