తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే మార్చి 15 నుంచి అన్ని పాఠశాలలకు ఒంటి పూట బడులు నడవనున్నట్లు విద్యాశాఖ వర్గాలు వెల్లడించారు. ఐతే దీనిపై ఇప్పటి వరకు ప్రభుత్వం ఎటువంటి ఉత్తర్వులు జారీ చేయలేదు. సాధారణంగా ప్రతి విద్యాసంవత్సరం వేసవి కాలంలో మార్చి 15 నుంచి ఒంటిపూట బడులు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది కూడా మార్చి 15 నుంచే ఒంటిపూట బడులు నడుస్తాయని విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. త్వరలో అందుకు సంబంధించిన ఆదేశాలు జారీ చేస్తామన్నారు. అన్ని పాఠశాలలు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు పనిచేస్తాయి. ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు మధ్యాహ్న భోజనం అందిస్తారు.
ఇక పదో తరగతి విద్యార్థులకు పరీక్షలు సమీపిస్తున్నందున ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహించడంలో పాఠశాల ఉపాధ్యాయుల్లో సందిగ్థత నెలకొంది. దీనిపై కూడా విద్యాశాఖ త్వరలో స్పష్టత ఇవ్వనుంది.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.