Telangana: ఇదెక్కడి చిత్రం రా సామి.! ఆవుపై అక్షింతలు వేస్తూ ఆశీర్వాదం.. ఎందుకంటే?

కొందరికి జంతువులు అంటే అమితమైన ప్రేమ. ముఖ్యంగా కుక్కలు, ఆవులను తమ సొంత పిల్లల్లా.. అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే ఖమ్మం జిల్లాకు చెందిన ఓ రైతు గోమాతను ప్రేమగా పెంచుకుంటున్నారు. ప్రతి ఏటా సొంత పిల్లాళ్లా పుట్టిన రోజు వేడుకలు నిర్వహిస్తున్నారు.

Telangana: ఇదెక్కడి చిత్రం రా సామి.! ఆవుపై అక్షింతలు వేస్తూ ఆశీర్వాదం.. ఎందుకంటే?
Cow Birthday Celebrations

Edited By:

Updated on: Jan 28, 2025 | 3:51 PM

మనం, మన పిల్లలకు పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకుంటాం. ఎవరికి వారు స్థాయి, ఇష్టాలను బట్టి గ్రాండ్‌గా బర్త్ డే సెలబ్రేషన్స్ జరుపుకుంటారు. బంధుమిత్రులందరినీ పిలుచుకుని విందు భోజనాలు ఏర్పాటు చేస్తుంటారు. అయితే ఇటీవల కాలంలో పెంపుడు జంతువులు, ఆవులకు బర్త్ డేలు, సీమంతం వంటి కార్యక్రమాలు చేస్తుండటం పరిపాటిగా మారిపోయింది. అదికూడ గ్రాండ్ లెవల్‌లో జరుపుకుంటున్నారు. ఇలాంటి ఘటననే ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది.

చింతకాని మండలం లచ్చగూడెం గ్రామానికి చెందిన చింతల లింగేశ్వరరావు అనే రైతు ఓ ఆవు దూడను చేరదీసి చిన్ననాటి నుంచి అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. ప్రతి సంవత్సరం ఆవుకు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. గోమాతకు పుట్టినరోజు వేడుకలు చేయడంతో వింతగా చూసిన గ్రామస్తులు, రైతు మమకారానికి ముగ్ధులై ఆవును అక్షింతలు వేసి ఆశీర్వదించారు. తాము పెంచుకుంటున్న గోమాతను తన చిన్న వయసు నుండే కుటుంబ సభ్యుల వలె ఎంతో ఆప్యాయంగా పెంచుకుంటున్నామని రైతు కుటుంబం సభ్యులు తెలిపారు. గోమాత మీద ఉన్న ప్రేమతో తన సొంత బిడ్డలా చూసుకుంటున్నామని, అందుకే పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నామని చింతల లింగేశ్వరరావు తెలిపారు.

గోమాతకు ఒంటిపై కొత్త బట్టలు ధరించి పుట్టినరోజు వేడుకలు చేశారు. అనంతరం గోమాతకు స్వీట్స్, ఫ్రూట్స్ తినిపించి హిందూ సంప్రదాయబద్ధంగా కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చి గోమాత చుట్టూ ప్రదక్షిణాలు దండాలు పెట్టుకున్నారు లింగేశ్వరరావు కుటుంబ సభ్యులు. తన ఇంట్లో పిల్లలకి పుట్టినరోజు వేడుకలు ఎలా చేసుకుంటారో దానికి తగ్గట్టు అదేవిధంగా జరుపుకున్నారు రైతు కుటుంబం. ఈ సెలబ్రేషన్స్ తిలకించడానికి వచ్చిన గ్రామంలో ఉన్న ప్రజలు చూసి రైతుకు అభినందనలు తెలియజేశారు. ఆవును ఆశీర్వదించారు.

వీడియో చూడండి.. 

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..