గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో అత్యున్నత రాజ్యాంగ పదవికి ఇవ్వాల్సిన గౌరవ మర్యాదలు ప్రభుత్వం ఇవ్వడం లేదని అన్నారు. జీ-20 సమావేశాల్లో భాగంగా హైదరాబాద్ గచ్చిబౌలిలో ఏర్పాటు చేసిన సి-20 సమాజ్‌శాల కార్యక్రమంలో గవర్నర్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. దేశాధినేతలనైనా కలవొచ్చు కానీ.. ఈ రాష్ట్ర చీఫ్‌ని మాత్రం కలవలేం అని అన్నారు. భారీ సెక్రటేరియట్ ప్రారంభిస్తే ఫస్ట్ సిటిజన్ తననే ఆహ్వానించలేదన్నారు.
ప్రగతి భవన్.. రాజ్‌భవన్ దూరంగా ఉంటున్నాయని గవర్నర్ అనడం సంచలనంగా మారింది. వివిధ దేశాలు ఒక్కచోటికి రాగలవు కానీ.. రాజ్‌భవన్ ప్రగతిభవన్ మాత్రం క్లోజ్ గా రావన్నారు. భారీ సెక్రటేరియట్ ప్రారంభిస్తే ఫస్ట్ సిటిజన్‌కి ఆహ్వానం లేదని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గవర్నరు కానీ, ముఖ్యమంత్రి కానీ స్వార్థం కోసం పనిచేయరని.. దేశం కోసం, ప్రజల కోసం మాత్రమే తాము ఉన్నామన్నారు. ప్రధాన మంత్రి మోదీ సహా అందరం అదేచేస్తున్నామన్నారు. నిస్వార్థంగా పనిచేయాలని గవర్నర్ హితవు పలికారు.
సచివాలయ ప్రారంభానికి తనకు ఆహ్వానం రాలేదని తెలిపారు. రాష్ట్ర ప్రథమ పౌరురాలిగా ప్రభుత్వం ఎప్పుడూ ప్రొటోకాల్ పాటించలేదని తప్పుబట్టారు. తాను తెలంగాణకు సేవ చేయడానికే వచ్చానని, రాజకీయాలు చేయడానికి కాదని ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుంచి తనపై వ్యతిరేక వైఖరి ప్రదర్శిస్తోందని తమిళిసై విమర్శించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం