AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: అయ్యబాబోయ్.. గూగుల్ మ్యాప్‌ను నమ్మితే డైరెక్ట్ చావు నోట్లోకే.. వీడియో చూడండి..

కొత్త రూటా? గూగుల్ మ్యాప్స్ ఉంటే చాలనుకుంటున్నారా? అయితే ఇది మీకోసమే.. టెక్నాలజీపై అతి నమ్మకం ఎంతటి ప్రమాదాలకు దారితీస్తుందో కాజీపేట ఫాతిమానగర్ వద్ద జరిగిన ఘటనే ఉదాహరణ. గూగుల్ మ్యాప్స్ నావిగేషన్‌ను గుడ్డిగా నమ్మి అర్ధరాత్రి హైవేపై ప్రయాణించిన ఓ భారీ కంటైనర్ డ్రైవర్ తృటిలో నిలువునా మునిగిపోయే ప్రమాదం నుండి తప్పించుకున్నాడు.

Telangana: అయ్యబాబోయ్.. గూగుల్ మ్యాప్‌ను నమ్మితే డైరెక్ట్ చావు నోట్లోకే.. వీడియో చూడండి..
Container Almost Falls Off Under Construction Bridge
G Peddeesh Kumar
| Edited By: |

Updated on: Jul 04, 2026 | 8:55 AM

Share

టెక్నాలజీ ఎంత పెరిగినా.. ఒక్కోసారి గుడ్డిగా నమ్మితే ప్రాణాలకే ముప్పు వస్తుందని నిరూపించే ఘటన ఇది. గూగుల్ మ్యాప్ నావిగేషన్‌ను నమ్ముకొని జాతీయ రహదారిపై వెళ్తున్న ఒక భారీ కంటైనర్ తృటిలో పెను ప్రమాదం నుండి తప్పించుకుంది. అదే అసలైన రహదారి అనుకొని.. నిర్మాణంలో ఉన్న ఒక రైల్వే ఓవర్ బ్రిడ్జిపైకి దూసుకెళ్లిందా కంటైనర్. అక్కడున్న స్థానికులు గమనించి అప్రమత్తం చేయడంతో ఒక పెద్ద ముప్పు తప్పింది. వరంగల్, హనుమకొండ నుండి హైదరాబాద్ వైపు వెళ్లే ప్రతి వాహనం కాజీపేటలోని ఫాతిమానగర్ బ్రిడ్జి మీదుగానే వెళ్లాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న బ్రిడ్జి మీద నుంచే రాకపోకలు కొనసాగుతుండగా, ట్రాఫిక్ ఇబ్బందులు తొలగించేందుకు అప్ అండ్ డౌన్ కోసం పక్కనే మరో కొత్త ROB నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. రెండు వైపులా పిల్లర్లు, స్లాబ్ ల నిర్మాణం కూడా పూర్తయింది. కేవలం రైల్వే శాఖ అనుమతి లభిస్తే ట్రాక్ ఉన్న ప్రాంతంలో స్లాబ్ లు నిర్మించేందుకు సర్వం సిద్ధం చేశారు. అంటే ప్రస్తుతం రైల్వే ట్రాక్స్ పైభాగంలో స్లాబ్ లేకుండా ఈ ROB నిర్మాణం పెండింగ్‌లో ఉంది.

మట్టికట్టను దాటుకుంటూ అర్ధరాత్రి దడ..

వాహనాలు పొరపాటున కూడా ఈ నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి పైకి వెళ్లకుండా అధికారులు అక్కడ ఒక పెద్ద మట్టికట్టను ఏర్పాటు చేశారు. అయితే ద్విచక్ర వాహనాల లోడ్‌తో వరంగల్ మీదుగా హైదరాబాద్‌కు వెళ్తున్న కంటైనర్ డ్రైవర్, అర్ధరాత్రి పూట గూగుల్ మ్యాప్ నావిగేషన్‌ను ఆన్ చేసుకుని ప్రయాణిస్తున్నాడు. మ్యాప్ చూపించిన రూట్ ప్రకారం.. చీకట్లో ఆ మట్టికట్టపై నుండే నిర్మాణంలో ఉన్న ROB మీదికి కంటైనర్‌ను ఎక్కించేసి దూసుకెళ్లాడు.

కాపాడిన ఆటో డ్రైవర్లు..

మరో వంద అడుగుల దూరం ముందుకు వెళితే.. ఆ భారీ కంటైనర్ నేరుగా బ్రిడ్జి పైనుండి కింద ఉన్న రైల్వే ట్రాక్‌పై పడిపోయేది. అదే జరిగితే కంటైనర్ డ్రైవర్ ప్రాణాలు గాల్లో కలవడంతో పాటు రైల్వే ట్రాక్‌పై భారీ ప్రమాదం జరిగి ఉండేది. సరిగ్గా అదే సమయంలో పాత బ్రిడ్జి పైనుండి వెళ్తున్న కొందరు ఆటో డ్రైవర్లు ఈ భీభత్సాన్ని గమనించారు. వెంటనే అప్రమత్తమై గట్టిగా కేకలు వేయడంతో కంటైనర్ డ్రైవర్ బ్రేక్ వేసి వాహనాన్ని నిలిపివేశాడు. దీంతో ఊపిరి పీల్చుకున్న కంటైనర్ డ్రైవర్ తృటిలో ప్రాణాలతో బయటపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన సదరు డ్రైవర్‌పై ట్రాఫిక్ రూల్స్ వయిలేషన్ కేసు నమోదు చేశారు. రాత్రి వేళల్లో, కొత్త రూట్లలో ప్రయాణించేటప్పుడు గూగుల్ మ్యాప్స్‌ను కేవలం ఒక అంచనా కోసమే వాడుకోవాలని, బోర్డులను, రోడ్డు పరిస్థితులను గమనిస్తూ అప్రమత్తంగా డ్రైవ్ చేయాలని పోలీసులు ప్రయాణికులను హెచ్చరిస్తున్నారు.

వీడియో చూడండి..

Follow Us
ఆ సినిమా హిట్ అవుతుందనుకున్నా.. కానీ ఫ్లాప్ అయ్యింది
ఆ సినిమా హిట్ అవుతుందనుకున్నా.. కానీ ఫ్లాప్ అయ్యింది
సింగరేణిలో 300 అప్రెంటిస్‌ పోస్టులు.. వీరికి మాత్రమే ఛాన్స్..
సింగరేణిలో 300 అప్రెంటిస్‌ పోస్టులు.. వీరికి మాత్రమే ఛాన్స్..
ఇంద్రుని తోటలోని ఈ మొక్క మీ ఇంటి అదృష్టాన్ని మార్చివేస్తుంది..!
ఇంద్రుని తోటలోని ఈ మొక్క మీ ఇంటి అదృష్టాన్ని మార్చివేస్తుంది..!
ఏ పథకంలో అత్యధిక వడ్డీ రేటు ఉంది? మీరు 1.5 లక్షలు జమ చేస్తే ఎంత?
ఏ పథకంలో అత్యధిక వడ్డీ రేటు ఉంది? మీరు 1.5 లక్షలు జమ చేస్తే ఎంత?
అప్పుడు అల్లు అర్జున్, చిరంజీవి ఇంటికి పని చేశాడు.. ఇప్పుడు
అప్పుడు అల్లు అర్జున్, చిరంజీవి ఇంటికి పని చేశాడు.. ఇప్పుడు
హైదరాబాద్ నుంచి బాలికి 5 రోజుల అదిరిపోయే టూర్.. పూర్తి వివరాలు..
హైదరాబాద్ నుంచి బాలికి 5 రోజుల అదిరిపోయే టూర్.. పూర్తి వివరాలు..
చికెన్ పచ్చడి పక్కా కొలతలు గ్రాములతో సహా..
చికెన్ పచ్చడి పక్కా కొలతలు గ్రాములతో సహా..
బీసీలకు అదిరిపోయే శుభవార్త.. స్థానిక సంస్థల్లో 34శాతం రిజర్వేషన్
బీసీలకు అదిరిపోయే శుభవార్త.. స్థానిక సంస్థల్లో 34శాతం రిజర్వేషన్
తేలు గురించి మీకు తెలియని ఆసక్తికర విషయాలు...
తేలు గురించి మీకు తెలియని ఆసక్తికర విషయాలు...
కొత్త స్టీల్ బ్రిడ్జి.. ఈ నలుగురిలో ఎవరు పేరు పెడతారో?
కొత్త స్టీల్ బ్రిడ్జి.. ఈ నలుగురిలో ఎవరు పేరు పెడతారో?