వాహనదారులకు అలర్ట్.. డ్రైవింగ్ లైసెన్స్, ఆర్‌సీ కార్డులపై రవాణా శాఖ కీలక ఆదేశాలు

తెలంగాణలో వాహనదారులకు డ్రైవింగ్ లైసెన్స్‌లు (DL), ఆర్‌సీ (RC) స్మార్ట్ కార్డులను సకాలంలో అందించేందుకు రాష్ట్ర రవాణా శాఖ కీలక అడుగులు వేస్తోంది. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న కార్డుల ప్రింటింగ్ మరియు డిస్పాచ్ ప్రక్రియను వేగవంతం చేయడంపై రవాణా శాఖ కమిషనర్ బుధవారం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాల వారీగా పెండింగ్ స్థితిగతులను పరిశీలించిన ఆయన.. నిర్దేశిత గడువులోగా పెండింగ్‌లో ఉన్న కార్డులన్నింటినీ క్లియర్ చేయాలని జిల్లా రవాణా అధికారులు (DTOs), మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్లను (MVIs) ఆదేశించారు.

వాహనదారులకు అలర్ట్.. డ్రైవింగ్ లైసెన్స్, ఆర్‌సీ కార్డులపై రవాణా శాఖ కీలక ఆదేశాలు
Telangana Driving Licence

Edited By:

Updated on: Jul 15, 2026 | 8:49 PM

తెలంగాణలో వాహనదారులకు డ్రైవింగ్ లైసెన్స్‌లు, RCస్మార్ట్ కార్డుల జారీ ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు రవాణా శాఖ కీలక అడుగులు వేస్తోంది. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న డీఎల్, ఆర్‌సీ కార్డుల ప్రింటింగ్, డిస్పాచ్ ప్రక్రియపై బుధవారం రవాణా శాఖ కమిషనర్ రాష్ట్ర స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాల వారీగా ఉన్న పెండింగ్Statusను పరిశీలించిన కమిషనర్.. గడువులోగా కార్డులన్నింటినీ క్లియర్ చేయాలని జిల్లా రవాణా అధికారులు,మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్లను ఆదేశించారు.

వాహన రిజిస్ట్రేషన్ కార్డుల ప్రింటింగ్‌కు సంబంధించి అధికారులు కీలక విషయాన్ని స్పష్టం చేశారు. ఆర్‌సీ కార్డులు ప్రింట్ కావాలంటే హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ వివరాలను సిస్టమ్‌లో అప్‌లోడ్ చేయడం తప్పనిసరి. ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న కార్డుల ప్రింటింగ్ వేగవంతం కావాలంటే.. డీలర్లు, అధికారులు వెంటనే HSRP వివరాలను అప్‌లోడ్ చేయాలని కమిషనర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

కార్డుల పంపిణీలో పారదర్శకత కోసం ఇకపై ప్రతి జిల్లాలో రోజూ ప్రింటింగ్, డిస్పాచ్ వివరాలను ట్రాక్ చేస్తారు. లబ్ధిదారులకు కార్డులు చేరడంలో జాప్యం జరగకుండా ఉండేందుకు.. డిస్పాచ్ చేసిన ప్రతి కార్డు EMS నంబర్‌ను అధికారులు రికార్డు చేయాల్సి ఉంటుంది.కొన్ని జిల్లాల్లో నిలిచిపోయిన ఈఎంఎస్ సిస్టమ్ గ్లిచెస్, లోకల్ ప్రింటింగ్ పరికరాల సమస్యలను యుద్ధప్రాతిపదికన పరిష్కరించాలని అధికారులకు సూచించారు.

ఇవి కూడా చదవండి

వాహనాల తనిఖీల్లో నిర్లక్ష్యం వహించే అధీకృత డీలర్ల పనితీరుపై రవాణా శాఖ సీరియస్ అయింది. తనిఖీల్లో పదే పదే లోపాలు కనిపిస్తే సదరు డీలర్లపై కఠిన చర్యలు ఉంటాయని, వారిని పూర్తి జవాబుదారీలను చేయాలని జిల్లా రవాణా అధికారులను కమిషనర్ ఆదేశించారు. పౌరులకు డ్రైవింగ్ లైసెన్స్‌లు, ఆర్‌సీ కార్డులను సకాలంలో అందించేందుకు రవాణా శాఖ కట్టుబడి ఉందని, క్షేత్రస్థాయి అధికారులకు ఎలాంటి సాంకేతిక లేదా సరఫరా లోపాలున్నా వెంటనే పరిష్కరిస్తామని కమిషనర్ భరోసా ఇచ్చారు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us