
ఇండిగో హైదరాబాద్ నుంచి బ్యాంకాక్ కు రోజువారీ డైరెక్ట్ ఫ్లైట్స్ ను ప్రారంభించింది. ఇది రెండు నగరాల మధ్య విమాన కనెక్టివిటీలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది. స్థానిక కాలమానం ప్రకారం సోమవారం తెల్లవారుజామున 03:55 గంటలకు హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బ్యాంకాక్ లోని విమానాశ్రయానికి 6ఈ1067 విమానం బయలుదేరింది.
ఎయిర్ బస్ ఎ 320 విమానాలచే నిర్వహించబడుతున్న ఈ కొత్త సర్వీస్ రెండు రద్దీగా ఉండే మహానగరాల మధ్య ప్రయాణీకులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తుంది. ఈ పరిణామంతో హైదరాబాద్- బ్యాంకాక్ మధ్య డైరెక్ట్ ఎయిర్ కనెక్టివిటీని ఏర్పాటు చేసిన తొలి భారతీయ విమానయాన సంస్థగా ఇండిగో గుర్తింపు పొందింది. అదనంగా, ఇండిగో బ్యాంకాక్, ఢిల్లీ, ముంబై, బెంగళూరు, కోల్కతా, భువనేశ్వర్ వంటి ప్రధాన భారతీయ నగరాల మధ్య కనెక్టివిటీని అందిస్తుంది. ఈ హైదరాబాద్ విమానాల ప్రవేశంతో ఇండిగో ఇండియా- బ్యాంకాక్ మధ్య మొత్తం వారపు విమానాలు ఇప్పుడు 37 కు చేరుకున్నాయి.
దేశంలోని ప్రధాన నగరాల్లో హైదరాబాద్ ఒకటి. ఈ భాగ్య నగరం నుంచే ఎన్నో వాణిజ్య కార్యాకలాపాలు కొనసాగుతుంటాయి. విదేశీయులు సైతం ఇక్కడికి వస్తుంటారు. ఇక వైద్య, వైద్యం, ఉపాధి కోసం మనవాళ్లు విదేశాలకు వెళ్తున్నారు. ఈక్రమంలో అలంటివాళ్ల కోసం అంతర్జాతీయ రాకపోకలను ద్రుష్టిలో ఉంచుకొని పలు విమాన సంస్థలు నేరుగా ప్రయాణించాలనే డైరెక్ట్ ఫ్లైట్స్ ను ప్రారంభిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇండిగో డైరెక్ట్ విమాన సేవలను ప్రారంభించింది.
అయితే ఇండిగో ఎయిర్ లైన్స్ కు చెందిన ఓ ప్రయాణికుడు విమానంలోని ఫుడ్ ఏరియాలో బొద్దింకలను చూపిస్తూ ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ వీడియోను పోస్ట్ చేసిన ఏవియేషన్ జర్నలిస్ట్ తరుణ్ శుక్లా ఎక్స్ లో పోస్ట్ చేశారు. విమానంలోని ఆహార ప్రాంతంలో బొద్దింకలు అంటూ స్పందించడంతో విమాన సేవలపై విమర్శలు వచ్చాయి.