
జీఆర్‌ఎంబీ(గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు) సమావేశం వాడివేడిగా సాగింది. మూడు గంటల పాటు జరిగిన భేటీలో నీటి వాటాలు, ప్రాజెక్టుల చర్చించారు. జల సౌధలో ఉదయం 11 గంటల 30 నిమిషాలకు బోర్డు చైర్మన్ ఏకే ప్రధాన్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. సమావేశానికి ఏపీ, తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారులు హాజరయ్యారు. బనకచర్ల, గోదావరి అనుసంధాన ప్రాజెక్ట్ లపై తెలంగాణ వ్యక్తం చేసిన అభ్యంతరాలపై సమావేశంలో చర్చించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తలపెట్టిన గోదావరి – బనకచర్ల ప్రాజెక్టు సమాచారం, వివరాలు దాచి పెడుతోందని తెలంగాణ నీటిపారుదల అధికారులు ఆరోపించారు.
తెలంగాణ నీటి పారుదలశాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఇంజినీర్ ఇన్ చీఫ్ అనిల్ బనకచర్ల ప్రాజెక్ట్‌పై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. జీఆర్‌ఎంబీకి కేంద్రం నుంచి లేఖ వచ్చి 5 నెలలవుతుందని, అయిన సమాచారం ఇవ్వలేదని తెలంగాణ అధికారులు ఆవేదన వ్యక్తం చేశారు. అనుమతులు లేకుండా ప్రాజెక్టు చేపడుతున్నారని ఆరోపించారు. ప్రాజెక్టు పూర్తి వివరాలు, దీనివల్ల తెలంగాణపై ప్రభావం లాంటి తదితర అంశాల వివరాలు ఏపీ సర్కార్ అందించాలని అధికారులు బోర్డును కోరారు. దీనిపై స్పందించిన ఏపీ అధికారులు బనకచర్ల ప్రాజెక్టుకు ఇంకా డీపీఆర్ తయారు చేయలేదని వివరణ ఇచ్చారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.