TSRTC కార్గో ద్వారా మీ ఇంటి వద్దకే “భద్రాద్రి సీతా-రాముల” కల్యాణ తలంబ్రాలు

భద్రాచలం రామయ్య-సీతమ్మ కల్యాణ తలంబ్రాలు మీ ఇంటికే హోమ్ డెలివరీ చేయనుంది టీఎస్ ఆర్టీసీ. ఇందుకు పెద్ద ప్రాసెస్ కూడా లేదు.

TSRTC కార్గో ద్వారా మీ ఇంటి వద్దకే “భద్రాద్రి సీతా-రాముల” కల్యాణ తలంబ్రాలు
Lord Rama Talambralu

Updated on: Mar 31, 2023 | 8:00 PM

తెలంగాణలోని రామాలయాలలో అన్నింటికంటే అతి పెద్ద ఆలయం భద్రాద్రి సీతారామాలయం. రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా భద్రాచలంలో స్వామివారి దేవస్థానం ఉంది.  హిందువులు ఆరాధ్య దైవంగా భావించే శ్రీరాముని ఆలయానికి చరిత్ర ఉంది. ప్రతి సంవత్సరం శ్రీరామనవమి రోజున ఈ దేవాలయ ప్రాంగణంలో శ్రీ సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా జరుగుతుంది. రాములోరి కళ్యాణం చూసేందుకు దేశ నలుమూలల నుంచి భక్తులు ఇక్కడకు వచ్చి.. స్వామివారిని దర్శించుకుంటారు. నిన్న రామనవమి సందర్భంగా ఆలయ ప్రాంగణంలో సీతారాముల కళ్యాణం అంగరంగా వైభవంగా నిర్వహించారు. ఈ క్రమంలోని ఇటీవల వెంకట్ నారాయణ్  ATM కార్గో హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి మేడమ్‌ని కలిసి భద్రాద్రి తలంబ్రాలు బుక్ చేయమని అభ్యర్థించారు.

ఈ నెల 30న జరిగిన “భద్రాద్రి సీతా-రాముల” కళ్యాణ తలంబ్రాలు TSRTC కార్గో ద్వారా మీ ఇంటి వద్దకే వచ్చి ఇస్తామని ప్రచారం చేేసింది TSRTC కార్గో .  ఈ నెల 30 న భద్రాద్రిలో జరిగిన “సీతారాముల” కళ్యాణ తలంబ్రాలు హైదరాబాద్, సికింద్రాబాద్ పట్టణ ప్రజలకు కేవలం రూ.116/- లకు భక్తుల ఇంటి వద్దకే వచ్చి ఇవ్వనున్నట్లు ప్రచారం చేసింది. నియమ నిష్టలతో ధాన్యాన్ని గోటితో ఒలిచి తీసిన కోటి బియ్యం గింజలను తలంబ్రాలుగా భద్రాద్రి శ్రీ సీతారాముల కల్యాణోత్సవంలో ఉపయోగిస్తున్నారు. విశిష్టమైన ఆ తలంబ్రాలు తీసుకోవడానికి భక్తులు కూడా ఆసక్తి చూపిస్తారు. ఈ నేపథ్యంలో కళ్యాణ తలంబ్రాలను భక్తులకు అందజేయాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా రూ.116 చెల్లించి (Online Booking) బుక్‌ చేసుకుంటే కళ్యాణం అనంతరం తలంబ్రాలను భక్తులకు హోం డెలివరీ చేయనున్నట్లు ప్రకటించింది.

శ్రీ సీతారాముల కల్యాణోత్సవ తలంబ్రాలకు భక్తుల నుంచి అనూహ్యస్పందన వస్తోంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా తలంబ్రాల బుకింగ్‌ జరుగుతోంది.  శ్రీరామ నవమి కల్యాణ సమయంలోనే కాకుండా.. తలంబ్రాలను ఎప్పుడైనా భక్తులు పొందే సదావకాశాన్ని కల్పించింది. కార్గో పార్శిల్‌ సెంటర్‌కు వెళ్లి రూ.116 చెల్లిస్తే నిర్ణీత సమయంలో తలంబ్రాలను భక్తులకు అందించనుంది.  ఇందుకోసం TSRTC లాజిస్టిక్స్‌ విభాగ ఫోన్‌ నంబర్లు 9177683134, 7382924900, 9154680020ను సంప్రదించాలన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి..