AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శవాలతో నయా దందా.. భాగ్యనగరంలో వెలుగు చూసిన సరికొత్త బిజినెస్..!

మనిషి బతికి ఉన్నప్పుడు మాత్రమే కాదు.. చచ్చాక కూడా కష్టాలు తప్పడం లేదు. బతికున్నప్పుడు ఎవరైనా ఆదరిస్తారో లేదో గౌరవం ఇస్తారో లేదో తెలియదు కానీ, చనిపోయాక అయినా ఆ మనిషికి విలువ ఇవ్వాలి. కానీ, ఇప్పుడు అదే మనిషి చావుకు కూడా నిజంగా డబ్బులతో విలువ కట్టే రోజులు వచ్చేశాయి. ఏకంగా శవాలతోనే బేరాలు ఆడుతున్న పరిస్థితులు దాపురించాయి.

శవాలతో నయా దందా.. భాగ్యనగరంలో వెలుగు చూసిన సరికొత్త బిజినెస్..!
Graveyard
Noor Mohammed Shaik
| Edited By: |

Updated on: May 04, 2025 | 10:21 AM

Share

మనిషి బతికి ఉన్నప్పుడు మాత్రమే కాదు.. చచ్చాక కూడా కష్టాలు తప్పడం లేదు. బతికున్నప్పుడు ఎవరైనా ఆదరిస్తారో లేదో గౌరవం ఇస్తారో లేదో తెలియదు కానీ, చనిపోయాక అయినా ఆ మనిషికి విలువ ఇవ్వాలి. కానీ, ఇప్పుడు అదే మనిషి చావుకు కూడా నిజంగా డబ్బులతో విలువ కట్టే రోజులు వచ్చేశాయి. ఏకంగా శవాలతోనే బేరాలు ఆడుతున్న పరిస్థితులు దాపురించాయి. శవాన్ని పూడ్చి పెట్టాలన్నా దానికి లెక్కలు కట్టేస్తున్నారు. చనిపోయిన సొంతవారిని చూసి ఏడవడం కాదు, ఆ శవాన్ని ఎలా పూడ్చిపెట్టేలా అనే విషయంలో ఇప్పుడు నిజంగానే కన్నీళ్లు పెట్టిస్తున్నారు. అసలు ఏంటి విషయం.. ఎందుకు ఇలాంటి పరిస్థితులు తలెత్తుతున్నాయో పూర్తి వివరాలు తెలుసుకుందాం.

శవాలతో బిజినెస్ మరెక్కడో వేరే రాష్ట్రంలో కాదు.. మన రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోనే ఇలాంటి దుస్థితి దాపురించింది. రాజేంద్రనగర్‌లో నయా దందా మొదలైంది. స్థానిక బుద్వేల్‌ పరిసరాల్లో శవాలతో బిజినెస్ నడుస్తోంది. చనిపోయిన మనిషి మృతదేహాన్ని పూడ్చి పెట్టడానికి ఒక్కో శవానికి రూ. 30 వేల నుంచి ఆపైనే బేరం ఆడుతున్నారు. అడిగినంత డబ్బులు ముట్టజెప్పితేనే శవాన్ని పూడ్చేది అయినా.. కాల్చేది అయినా. అలా ఈ పద్దతిలో కూడా దందా సాగుతుంది కొందరికి. ఇది కాస్తా ఇప్పుడు బాగానే కొనసాగుతూ బిజినెస్ రూపం దాల్చుతుంది.

అయితే.. వక్ఫ్‌ సవరణ చట్టం ముందు వరకూ శ్మశానాల కబ్జా యథేచ్ఛగా కొనసాగేది. ఇప్పుడు చట్టం ఆమోదం పొందిన తర్వాత కబ్జాలు కుదరకపోవడంతో ఏకంగా శవాలతోనే బేరాలు మొదలెట్టేశారు కొందరు మాయగాళ్లు. ఇది ఎంతలా పెరిగిపోయిందంటే ఒక్కో శవానికి కనీసం రూ.15 వేలకు తగ్గకుండా వసూళ్లు సాగుతున్నాయంటే ఆశ్చర్యపోనక్కర్లేదు.

నిన్నటికి నిన్న ఇలాగే బేరం సాగుతుండగా.. అడిగినంత డబ్బులు లేవని, తాము ఇచ్చుకోలేమని చెప్పడంతో శవాన్ని ముతవల్లీలు ఏకంగా 7 గంటల పాటు శ్మశానంలో అలాగే ఉంచేశారు. ఇలాంటి పరిస్థితులు చూస్తుంటే.. నిజంగా సమాజంలో మానవత్వం అనేది చచ్చిపోయిందా అనే సందేహం రాక మానదు. బుద్వేల్‌ పరిసర ప్రాంతంలో శ్మశానాల విషయంలో ముతవల్లీలలదే పెత్తనం. స్థానిక రాజకీయ నాయకుల అండదండలతో ముతవల్లీలు మరింత రెచ్చిపోతున్నారు. విచ్చలవిడిగా శవ మాఫియా నడిపిస్తున్నారు. ఇదిలా ఉండగా.. చనిపోయిన మనిషికి కనీసం ప్రశాంతంగా అంతిమ సంస్కారాలు చేద్దామన్నా అవకాశం లేకుండా పోయిందని స్థానికులు వాపోతున్నారు. దీనిపై స్థానిక ప్రజాప్రతినిధులు దృష్టి సారించి ఈ సమస్యకు పరిష్కారం చూపాలని కోరుతున్నారు.

మరిన్ని హ్యమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..