పుట్టిన ఊరు కోసం సహాయం.. పాఠశాలలో 60 లక్షలతో సైన్స్‌ల్యాబ్ ఏర్పాటు..
తాను పుట్టి పెరిగిన సమాజానికి తిరిగి ఏదైనా ఇవ్వాలనే ఉద్దేశంతో, మెదక్ జిల్లా మాసాయిపేట మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో అత్యాధునిక సైన్స్ బ్లాక్, లైబ్రరీ భవనాన్ని డాక్టర్ మాధవిరెడ్డి, ఆమె భర్త డాక్టర్ శ్రీకాంత్ మండుమాల నిర్మించారు. మాసాయిపేట గ్రామానికి చెందిన రైతు దంపతులు అంతిరెడ్డిగారి కేశవరెడ్డి, రామలక్ష్మి దంపతుల కుమార్తె డాక్టర్ మాధవి.
వేరే దేశాల్లో ఉంటు పుట్టిన ఊరిని మరచిపోతున్న ఈరోజుల్లో…కొంతమంది మాత్రము తాము ఎక్కడ ఉన్నా కూడా పుట్టిన ఊరి కోసం ఎదో చేయాలని ఆలోచిస్తున్నారు…ఎంతో కొంత సహాయం చేస్తూ ఊరు అభివృద్ధికి పాటు పడుతున్నారు..ఆ కోవలోకే వస్తారు డా;మాధవి.. తాను పుట్టి పెరిగిన సమాజానికి తిరిగి ఏదైనా ఇవ్వాలనే ఉద్దేశంతో, మెదక్ జిల్లా మాసాయిపేట మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో అత్యాధునిక సైన్స్ బ్లాక్, లైబ్రరీ భవనాన్ని డాక్టర్ మాధవిరెడ్డి, ఆమె భర్త డాక్టర్ శ్రీకాంత్ మండుమాల నిర్మించారు. మాసాయిపేట గ్రామానికి చెందిన రైతు దంపతులు అంతిరెడ్డిగారి కేశవరెడ్డి, రామలక్ష్మి దంపతుల కుమార్తె డాక్టర్ మాధవి..గత కొన్ని సంవత్సరాలుగా యూకే లో ఉంటున్నారు..
ఇటీవలే మధవి మూడేళ్ల క్రితం మాసాయిపేట గ్రామంలో ఉన్న పాఠశాలను సందర్శించారు.. వివిధ సంస్థల సహకారంతో అణగారిన వర్గాల కోసం పనిచేస్తున్న డాక్టర్ మాధవి ప్రాథమిక పాఠశాలకు పెయింటింగ్ వేయడంతో పాటు ఫర్నిచర్, స్పోర్ట్స్ మెటీరియల్, సైన్స్ ల్యాబ్ పరికరాలను విరాళంగా ఇచ్చారు..అనంతరం పాఠశాలలోని ఉపాధ్యాయులు,విద్యార్థులతో చర్చించిన డాక్టర్ మాధవి లైబ్రరీ అండ్ సైన్స్ ల్యాబ్ కోసం బిల్డింగ్ బ్లాక్ చేపట్టాలని నిర్ణయించారు..స్థానిక స్వచ్ఛంద సంస్థ డాక్టర్ సుగుణ రామ్ మోహన్ ఎడ్యుకేషనల్ సొసైటీ, యూకేకు చెందిన లయన్స్ క్లబ్ ఆఫ్ ఎన్ఫీల్డ్, ఎంపవర్మెంట్ త్రూ ఎడ్యుకేషన్, శాంత ఫౌండేషన్ అనే మూడు అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థలతో కలిసి ఆమె ఈ పనిని చేపట్టారు..ఆరు నెలల్లో పనులు పూర్తయ్యాయి.
ఈ భవనానికి ఆమె తండ్రి అంతిరెడ్డిగారి కేశవరెడ్డి పేరు పెట్టారు..ఈ పనులకు రూ.60 లక్షలు కేటాయించారు. సోమవారం పాఠశాల ఆవరణలో జరిగిన ప్రారంభ కార్యక్రమంలో యూకేకు చెందిన డా: మాధవి దంపతులకు ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ మాధవి, స్వచ్ఛంద సంస్థల సహయంతో పేద విద్యార్థుల ఉన్నత చదువులకు ట్యూషన్ ఫీజు చెల్లించి బాధ్యత తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఏది ఏమైనా జాబ్ వచ్చి వేరే దేశం వెళ్లిపోయిన కూడా పుట్టిన ఊరు కోసం ఇలా సహాయం చేయాలనే ఆలోచన చాలామందికి రాదు.. ఇలాంటి వారు ఉండడం చాలా అరుదు.