బయటకు వెళ్తున్న తండ్రికి ‘బై’ చెబుతూ.. భవనం పై నుంచి జారిపడి బాలుడు మృతి!

తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. బయటకు వెళ్తున్న తండ్రికి చేతులు ఊపుతూ బై.. చెబుతూ నాలుగేళ్ల బాలుడు భవనంపై నుంచి జారి పడి మృత్యువాత పడ్డాడు. ఆదివారం (ఆగస్ట్‌ 17) చోటు చేసుకున్న ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. అసలేం జరిగిందంటే..

బయటకు వెళ్తున్న తండ్రికి ‘బై’ చెబుతూ.. భవనం పై నుంచి జారిపడి బాలుడు మృతి!
Boy Dies After Falling From Building

Updated on: Aug 17, 2025 | 3:06 PM

సంగారెడ్డి, ఆగస్ట్‌ 17: పిల్లలు ఉన్న ఇంట్లో పెద్దవాళ్లు అప్రమత్తంగా ఉండటం చాలా అవసరం. ఎందుకంటే వాళ్లు తెలిసీ తెలియక చేసే పనులు ఒక్కోసారి తీరని నష్టాన్ని మిగులుస్తుంది. తాజాగా అటువంటి సంఘటనే తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. బయటకు వెళ్తున్న తండ్రికి చేతులు ఊపుతూ బై.. చెబుతూ నాలుగేళ్ల బాలుడు భవనంపై నుంచి జారి పడి మృత్యువాత పడ్డాడు. ఆదివారం (ఆగస్ట్‌ 17) చోటు చేసుకున్న ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. అసలేం జరిగిందంటే..

సంగారెడ్డి జిల్లా పటేల్‌గూడ పరిధి బీహెచ్‌ఈఎల్‌ కాలనీలో విషాదం చోటు చేసుకుంది. ఓ భవనం రెండో అంతస్తులో నివాసం ఉంటున్న కుటుంబంలో అంతులేని విషాదం మిగిలింది. నాలుగేళ్ల హర్షవర్ధన్‌ అనే బాలుడు.. బయటకు వెళ్తున్న తండ్రికి ‘బై’ చెబుతూ పొరబాటున రెండో అంతస్తు నుంచి జారిపడ్డాడు. అంత ఎత్తునుంచి కింద పడటంతో తీవ్రంగా గాయపడిన హర్షవర్ధన్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. అప్పటి వరకు కళ్లముందే మద్దులొలుకుతూ గెంతులేస్తూ అల్లరిచేస్తున్న కుమారుడు క్షణాల్లో మృతి చెందడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. బాలుడి మృతితో పరిసర ప్రాంతమంతా విషాద ఛాయలు అలముకున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.