TDP: మాజీ టీడీపీ ఎమ్మెల్యే కన్నుమూత.. హైదరాబాద్‌ ఏఐజీ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ

|

Jun 13, 2023 | 7:31 AM

Kothakota Dayakar Reddy: మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. హైదరాబాద్ ఏఐజీ అస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. టీడీపీ తరఫున దయాకర్ రెడ్డి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అమరచింత నుంచి రెండు సార్లు , ఒకసారి మక్తల్ నుంచి ఎమ్మెల్యేగా దయాకర్ రెడ్డి విజయం సాధించారు.

TDP: మాజీ టీడీపీ ఎమ్మెల్యే కన్నుమూత.. హైదరాబాద్‌ ఏఐజీ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ
Kothakota Dayakar Reddy
Follow us on

హైదరాబాద్, జూన్ 13: తెలంగాణలో సీనియర్ పొలిటిషన్, మక్తల్ మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న ఆయన.. మంగళవారం తెల్లవారుజామున కన్నుమూశారు. దయాకర్ రెడ్డి అనారోగ్య కారణాలతో ఈ మధ్యే ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు.. ఆ తర్వాత కోలుకుని మహబూబ్‌నగర్ జిల్లాలోని తన స్వగ్రామమైన పర్కపురంలో ఉంటున్నారు. అయితే మరోసారి ఆరోగ్య పరిస్థితి క్షీనించడంతో తిరిగి హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రిలో చేరారు. అక్కడ చికిత్సపొందుతూ కన్నుమూశారు. దయాకర్ మరణంపై ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు, తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు, తెలంగాణ నేతలు, ప్రముఖులు సంతాపాన్ని వ్యక్తం చేశారు.

దయాకర్‌రెడ్డి దంపతులు గతేడాది ఆగస్టులో తెలుగు దేశం పార్టీకి రాజీనామా చేశారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే  టీడీపీని వీడాల్సి వస్తుందని కన్నీళ్లు పెట్టుకున్నారు. అయితే, ఆ తర్వాత మరో పార్టీకి వెళ్తారని ప్రచారం జరిగింది. ఏ పార్టీ అని క్లారిటీ ఇవ్వకపోవడం.. ఆ తర్వాత ఏ పార్టీలో చేరలేదు. వీరు గత కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఇంతలో దయాకర్ రెడ్డి అనారోగ్యానికి గురికావడంతో పార్టీ మార్పు దిశగా ఎలాంటి ప్లాన్ చేయలేదు. కానీ నియోజకవర్గంలో కొత్తకోట దయాకర్ రెడ్డికి భారీ ఎత్తున అభిమానులు ఉండటం.. అంతే కాకుండా నియోజకవర్గ సమస్యలపై పూర్తి స్థాయిలో పట్టు ఉండటంతో ఈ ఎన్నికల్లో మరోసారి పోటీ చేస్తారని ఊహాగానాలు నడిచాయి.

కొత్తకోట దయాకర్ రెడ్డి దేవరకద్ర నియోజకవర్గం, మక్తల్ నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా పని చేశారు. కొత్తకోట దయాకర్ రెడ్డి ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నాడు.

ఇక, కొత్తకోట దయాకర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాలోకి వచ్చి 1989లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అమరచింత నియోజకవర్గం (ప్రస్తుతం దేవరకద్ర నియోజకవర్గం) నుంచి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి కొల్లికొదురు వీరారెడ్డి చేతిలో 6751 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. ఆయన 1994లో 44963 ఓట్ల మెజారిటీతో , 1999లో 22307 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి కొల్లికొదురు వీరారెడ్డి పై గెలిచారు.

కొత్తకోట దయాకర్ రెడ్డికి టీడీపీ నుంచి 1994,1999లో అమరచింత నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2009లో మక్తల్ నుంచి టీడీపీ నుంచి పోటీచేసి గెలుపొందారు. దయాకర్ రెడ్డి భార్య సీత కూడా టీడీపీ నుంచి 2002లో జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా పనిచేశారు. 2009లో దేవరకద్ర నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. దంపతులిద్దరికి టీడీపీతో మంచి అనుబంధం ఉంది. విభజన తర్వాత కూడా పార్టీలోనే కొనసాగారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం