TGSRTC Free Bus Travel: ‘ఉచిత.. గిచిత.. ప్రయాణం లేదు! దిగండి..’ ఆర్టీసీ బస్సు కండక్టర్ భాగోతం

|

Jul 03, 2024 | 2:41 PM

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఆర్టీసీ ఉచిత ప్రయాణం రోజుకొక్క వివాదంలో ఇరుక్కుంటుంది. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నామని రేవంత్‌ సర్కార్‌ చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం మహిళలకు ఇబ్బందులు తప్పడం లేదు. తాజాగా వేములవాడ రాజన్న దర్శనానికి వచ్చిన ఓ కుటుంబానికి చేదు అనుభవం ఎదురైంది. దర్శనం అనంతరం ఇంటికి..

TGSRTC Free Bus Travel: ఉచిత.. గిచిత.. ప్రయాణం లేదు! దిగండి.. ఆర్టీసీ బస్సు కండక్టర్ భాగోతం
Forced Down Devotee Family from RTC Bus
Follow us on

వేములవాడ, జూన్‌ 2: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఆర్టీసీ ఉచిత ప్రయాణం రోజుకొక్క వివాదంలో ఇరుక్కుంటుంది. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నామని రేవంత్‌ సర్కార్‌ చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం మహిళలకు ఇబ్బందులు తప్పడం లేదు. తాజాగా వేములవాడ రాజన్న దర్శనానికి వచ్చిన ఓ కుటుంబానికి చేదు అనుభవం ఎదురైంది. దర్శనం అనంతరం ఇంటికి బయల్దేరిని కుటుంబం సోమవారం సాయంత్రం జగిత్యాల బస్‌స్టాప్‌లో ఆర్టీసీ బస్సు ఎకేందుకు ప్రయత్నించారు. ఇంతలో వారిని డోర్‌ వద్ద అడ్డుకున్న లేడీ కండక్టర్‌ వారిని ఆర్టీసీ బస్సు ఎక్కకుండా అడ్డుకుంది.

‘ఉచిత.. గిచిత ప్రయాణం లేదు. ముందు తనిఖీ అధికారులు ఉన్నారు. వారు చూస్తే రూ.500 ఫైన్‌ విధిస్తారు’ అంటూ సదరు బస్సు కండక్టర్ కస్సుబుస్సుమంది. ఆ వెంటనే సదరు కుటుంబ సభ్యులను కూడా బలవంతంగా కిందికి దించేసింది. దీంతో ఈ మొత్తం వ్యవహారాన్ని అదే బస్సులో ఉన్న తోటి ప్రయాణికులు వీడియో తీసి సోషల్‌ మీడియాల్‌ పోస్ట్‌ చేశారు. అది కాస్తా వైరల్‌గా మారడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

ఇలా బలవంతంగా బస్సు నుంచి కిందికి దింపడంతో సదరు కుటుంబసభ్యులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. చేసేదిలేక మరో బస్సు వచ్చేంత వరకు వేచి చూశారు. ఈ పంచాయితీ వేములవాడ ఆర్టీసీ డిపో మేనేజర్‌ మురళీకృష్ణ వద్దకు చేరడంతో అసలేం జరిగిందనే దానిపై ఆరా తీయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో సదరు బస్సు కండక్టర్‌ను పిలిపించి ఆమెను విచారించినట్టు తెలుస్తోంది. అయితే ప్రయాణికులతో దురుసుగా ప్రవర్తించిన మహిళా కండక్టర్‌పై ఎలాంటి చర్యలు తీసుకున్నారనే దానిపై ఇప్పటి వరకూ సమాచారం లేదు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.