AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పురి విప్పి నాట్యం చేసే నెమళ్లకు ఏమైంది.. ఆ ప్రాంతంలో ఒక్కసారిగా నిశ్శబ్దం.. అసలేం జరిగిందంటే..

సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం కొండరాజుపల్లి గ్రామ పరిధిలోని ఏనుగురాళ్ల సమీపంలో ఐదు నెమళ్లు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపింది. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని కళేబరాలను స్వాధీనం చేసుకుని పంచనామా నిర్వహించారు. విషపు గింజలు కారణమా? లేక ఏదైనా వ్యాధి ప్రభావమా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

పురి విప్పి నాట్యం చేసే నెమళ్లకు ఏమైంది.. ఆ ప్రాంతంలో ఒక్కసారిగా నిశ్శబ్దం.. అసలేం జరిగిందంటే..
Peacock
P Shivteja
| Edited By: |

Updated on: Jun 15, 2026 | 1:49 PM

Share

అందాల నెమళ్లకు నిలయమైన ఆ ప్రాంతంలో ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవరించింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు నెమళ్ళు మృత్యువాత పడడంతో విషాదం నెలకొంది.. వివరాల్లోకి వెళ్తే సిద్దిపేట జిల్లా నంగునూరు (మం) కొండరాజుపల్లి గ్రామ పరిధిలోని ఏనుగురాళ్ల సమీపంలో ఐదు నెమళ్లు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాయి. ఒకే చోట ఐదు జాతీయ పక్షులు జీవం లేకుండా పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు, వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందిన వెంటనే ఫారెస్ట్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతి చెందిన ఐదు నెమళ్ల కళేబరాలను స్వాధీనం చేసుకుని, నిబంధనల ప్రకారం పంచనామా నిర్వహించారు. అనంతరం వాటిని అదే ప్రాంతంలో పూడ్చిపెట్టారు.

అయితే, ఈ పక్షుల మరణాలపై ఇప్పుడు పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పంటలను కాపాడుకోవడానికి ఎవరైనా ఉద్దేశపూర్వకంగా విషపు గింజలు చల్లడం వల్ల ఈ నెమళ్లు మృతి చెందాయా? లేక ఏదైనా గుర్తుతెలియని వ్యాధి బారిన పడి ప్రాణాలు కోల్పోయాయా? అనే కోణంలో అధికారులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. మూగజీవాల మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అటవీ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. పంచనామా రిపోర్ట్ ప్రకారం.. చర్యలు తీసుకోనున్నట్లు అటవీశాఖ అధికారులు వెల్లడించారు.

Peacock Deaths

Peacock Deaths

మరో వైపు జాతీయ పక్షి హోదా ఉన్న నెమళ్లు ఇలా వరుసగా మృత్యువాత పడటం పట్ల పర్యావరణ ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొండరాజు పల్లిలోని ఏనుగురాళ్ల సమీపంలో ఐదు నెమళ్లు ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా కలకలం రేపింది. వీటిపై విష ప్రయోగం జరిగిందా? లేక మరేదైనా కారణం ఉందా? అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. అధికారులు సమగ్ర విచారణ జరిపి అసలు నిజాలను బయటకు తీయాలని జంతు ప్రేమికులతో పాటు స్థానికులు కోరుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
చంద్ర గ్రహణం వీరికి మహా యోగం.. ఉద్యోగ ఆఫర్లు, ఆర్థిక కష్టాలు ఖతం!
చంద్ర గ్రహణం వీరికి మహా యోగం.. ఉద్యోగ ఆఫర్లు, ఆర్థిక కష్టాలు ఖతం!
ఇంగ్లిష్ అవసరం లేదు.. Multilingual AIతో మారనున్న డిజిటల్‌ వరల్డ్‌
ఇంగ్లిష్ అవసరం లేదు.. Multilingual AIతో మారనున్న డిజిటల్‌ వరల్డ్‌
అరెరే ఎలుకలను తరిమికొట్టడం ఇంత ఈజీనా.. ఇన్నాళ్లు ఎంత కష్టపడ్డామో!
అరెరే ఎలుకలను తరిమికొట్టడం ఇంత ఈజీనా.. ఇన్నాళ్లు ఎంత కష్టపడ్డామో!
దేశానికి షుగర్ టెన్షన్.. ఊహించని విధంగా పెరుగుతున్న ధరలు..
దేశానికి షుగర్ టెన్షన్.. ఊహించని విధంగా పెరుగుతున్న ధరలు..
ఎస్బీఐ అకౌంట్ ఉన్నవారికి బ్యాడ్‌న్యూస్.. మారిన నిబంధనలు..
ఎస్బీఐ అకౌంట్ ఉన్నవారికి బ్యాడ్‌న్యూస్.. మారిన నిబంధనలు..
ఏకంగా విరాట్ కోహ్లీ బ్రాండ్‌కే ఎసరు పెట్టారు కదరా!
ఏకంగా విరాట్ కోహ్లీ బ్రాండ్‌కే ఎసరు పెట్టారు కదరా!
మా తాత తెలుగులో తోపు నటుడు.. కానీ నాతో మాట్లాడి 9ఏళ్లు అవుతుంది
మా తాత తెలుగులో తోపు నటుడు.. కానీ నాతో మాట్లాడి 9ఏళ్లు అవుతుంది
టెస్ట్ చరిత్రలోనే పరమ చెత్త రికార్డు నెలకొల్పిన బ్యాటర్లు వీళ్లే
టెస్ట్ చరిత్రలోనే పరమ చెత్త రికార్డు నెలకొల్పిన బ్యాటర్లు వీళ్లే
ఎల్లలు దాటిన ప్రేమకథ.. స్కాటిష్ ఎంపీని పెళ్లాడిన కేరళ మహిళ
ఎల్లలు దాటిన ప్రేమకథ.. స్కాటిష్ ఎంపీని పెళ్లాడిన కేరళ మహిళ
రాబోయే రోజుల్లో వెండి ధరలు మరింత తగ్గుతాయా..?
రాబోయే రోజుల్లో వెండి ధరలు మరింత తగ్గుతాయా..?
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర