
Hyderabad: హైదరాబాద్‌లో కల్పుల ఘటన కలకలం రేపింది. కోఠిలోని ఎస్‌బీఐ కార్యాలయం దగ్గర దుండగులు కాల్పులకు తెగబడ్డారు. రషీద్ అనే వ్యక్తిపై కాల్పులు జరిపి రూ.6 లక్షలకు దోపిడికి పాల్పడ్డారు. డబ్బులు డిపాజిట్ చేయడానికి వచ్చిన రషీద్‌పై గన్‌తో కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో రషీద్ కాలుకు బుల్లెట్ గాయం కాగా, వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే ఈ ఘటనకు సంబంధించి వివరాలను సేకరిస్తున్నారు పోలీసులు. సీసీ పుటేజ్‌ని పరిశీలిస్తున్నారు సుల్తాన్ బజార్ పోలీసులు.
అయితే పోలీసులు స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. సుల్తాన్ బజార్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఉదయాన్నే ఒక్కసారిగా కాల్పుల మోత వినిపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.