యూనియన్ బ్యాంక్‌లో అగ్ని ప్రమాదం.. కాలి బూడిదైన ఫైళ్లు

యూనియన్ బ్యాంక్‌లో తెల్లవారుజామున అగ్నిప్రమాదం కలకలం రేపింది. షార్ట్ సర్క్యూట్ కారణమనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏసీలు, సీలింగ్, కంప్యూటర్లు, కొన్ని ఫైల్స్ దగ్ధమయ్యాయి. అయితే స్ట్రాంగ్ రూమ్, నగదు సురక్షితంగా ఉండటంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

యూనియన్ బ్యాంక్‌లో అగ్ని ప్రమాదం.. కాలి బూడిదైన ఫైళ్లు
Fire Accident In Madhira

Edited By:

Updated on: Aug 05, 2026 | 2:59 PM

ఖమ్మం జిల్లా మధిర యూనియన్ బ్యాంక్‌లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. బుధవారం ఉదయం 7 గంటల సమయంలో ఒక్కసారిగా బ్యాంకు నుంచి పొగలు రావడంతో స్థానికులు భయాందోళన చెందారు. షార్ట్ సర్క్యూట్‌తో ఫైర్ యాక్సిడెంట్ జరిగినట్లు ప్రాథమిక సమాచారం. వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొని వచ్చారు.

యూనియన్ బ్యాంక్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో బ్యాంకులో ఉన్న ఏసీలతో పాటు సీలింగ్ కాలిపోయింది. కంప్యూటర్లు, క్యాష్ కౌంటర్లు , ఫైల్స్ కూడా కొన్ని అగ్నికి ఆహుతి అయ్యాయి. స్ట్రాంగ్ రూమ్ భద్రంగానే ఉన్నట్లు సిబ్బంది వెల్లడించారు. ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఇదే బ్యాంకు బ్రాంచ్‌లో గతంలో కూడా అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం బ్యాంకు పనివేళల్లో కాకుండా ఉదయం బ్యాంక్ తెరవకముందే జరగడంతో పెద్ద ప్రమాదం తప్పింది. సిబ్బంది వచ్చేలోపు కొన్ని ఫైల్స్ దగ్దం అయ్యాయి. అయితే క్యాష్ కౌంటర్లు, నగదు , స్ట్రాంగ్ రూమ్స్ సేఫ్ గానే ఉండటం తో ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాద ఘటనతో ఖాతాదారులు ఆందోళన చెందారు. బ్యాంకులో ఫైర్ సేఫ్టీ, భద్రత ఉండాలని స్థానికులు కోరుతున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఈ ఘటన పై వివరాలు సేకరించి, విచారణ చేస్తున్నారు.

వీడియో చూడండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Loading...
Unable to load recommendations.
Follow Us