Kattedan Fire Accident: రంగారెడ్డి జిల్లా కాటేదాన్ పారిశ్రామికవాడలో అగ్ని ప్రమాదం

|

Aug 23, 2021 | 7:04 AM

రంగారెడ్డి జిల్లా కాటేదాన్ పారిశ్రామిక వాడలో రాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. వినాయక స్పాంజ్ కంపెనీ, దానమ్మ ప్లాస్టిక్ ముడిసరుకు కంపెనీలలో రాత్రి

Kattedan Fire Accident: రంగారెడ్డి జిల్లా కాటేదాన్ పారిశ్రామికవాడలో అగ్ని ప్రమాదం
Fire
Follow us on

Fire Accident: రంగారెడ్డి జిల్లా కాటేదాన్ పారిశ్రామిక వాడలో రాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. వినాయక స్పాంజ్ కంపెనీ, దానమ్మ ప్లాస్టిక్ ముడిసరుకు కంపెనీలలో రాత్రి 10:30 సమయంలో ఒక్కసారిగా పెద్ద ఎత్తున పొగ వచ్చి.. వెంటనే భారీగా మంటలు ఎగసిపద్దాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది సకాలంలో సంఘటన స్థలానికి చేరుకుని నాలుగు ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలు ఇతర కంపెనీలకు వ్యాపించకుండా రెండున్నర గంటల పాటు శ్రమించి అదుపులోకి తెచ్చారు.

ఈ మంటల ధాటికి రెండు కంపెనీల్లో ముడిసరుకు పూర్తిగా దగ్ధమైంది. అర్ధరాత్రి సమయం కావడంతో ప్రాణనష్టం జరగలేదు. ప్రమాదానికి గల కారణాలు షార్ట్ సర్క్యూట్ అని భావించినప్పటికీ ప్రతిరోజు షాప్ మూసివేసిన తర్వాత మెయిన్ ఆఫ్ చేసే వెళ్తామని ఆ కంపెనీలో పనిచేసే సిబ్బంది అంటున్నారు.

ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. అర్ధరాత్రి సమయంలో చెలరేగిన మంటలకు రెండు గోదాములు ఆహుతయ్యాయి. చూస్తుండగానే మంటలు చెలరేగాయి.

 

Read also: Shamirpet: చిన్న నిర్లక్ష్యం.. ఎంత పెద్ద ప్రమాదానికి దారి తీసింది.. శామీర్‌పేట్‌ దగ్గర జరిగిన యాక్సిడెంట్‌ చూస్తే షాకవుతారు.!