తెలంగాణ అసెంబ్లీలో ‘ఓట్ ఆన్ అకౌంట్’ బడ్జెట్ ప్రవేశపెట్టిన భట్టి విక్రమార్క..

తెలంగాణ అసెంబ్లీలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. శనివారం రాష్ట్ర ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్‎ను ప్రవేశపెట్టారు. రూ. 2లక్షల 75వేల 891 కోట్లతో రాష్ట్ర బడ్జెట్‎ను రూపొందించినట్లు తెలిపారు. మూలధన వ్యయం రూ. 29,669కోట్లు కాగా రెవెన్యూ వ్యయం రూ. 2,01,178 కోట్లుగా వెల్లడించారు.

తెలంగాణ అసెంబ్లీలో 'ఓట్ ఆన్ అకౌంట్' బడ్జెట్ ప్రవేశపెట్టిన భట్టి విక్రమార్క..
Telangana Budget
Follow us

|

Updated on: Feb 10, 2024 | 1:00 PM

తెలంగాణ అసెంబ్లీలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. శనివారం రాష్ట్ర ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్‎ను ప్రవేశపెట్టారు. రూ. 2లక్షల 75వేల 891 కోట్లతో రాష్ట్ర బడ్జెట్‎ను రూపొందించినట్లు తెలిపారు. మూలధన వ్యయం రూ. 29,669కోట్లు కాగా రెవెన్యూ వ్యయం రూ. 2,01,178 కోట్లుగా వెల్లడించారు. ద్రవ్యలోటు రూ.33,786 కోట్లు ఉండగా.. రెవెన్యూఖాతాలో మిగులు రూ.9,031 కోట్లు ఉన్నట్లు ప్రకటించారు. మూలధన వ్యయం రూ.24,178 కోట్లు ఉన్నట్లు తెలిపారు. 2024-25 సంవత్సరానికి గాను సవరించిన అంచనాలు రూ.2,24, 625 కోట్లుగా పేర్కొన్నారు.

ఆర్థిక ఇబ్బందులున్నా ఆరు గ్యారెంటీలకు పెద్దపీట వేశామన్నారు. నిస్సహాయులకు సాయం చేయడమే తమ ప్రభుత్వ ధ్యేయం అన్నారు. తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం వచ్చిందన్నారు. మార్పును కోరుతూ తెలంగాణ సమాజంలో స్వేచ్ఛ వచ్చిందన్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఎన్నికల్లో చెప్పిన ఆరు గ్యారెంటీలు అమలు చేసి తీరుతామన్నారు. సామాజిక న్యాయం చేసి చూపిస్తామన్నారు. ప్రజాల కాంక్షలను నెరవేర్చి చూపిస్తామన్నారు. ఆరోగ్య శ్రీ పరిమితిని రూ. 10లక్షలకు పెంచామన్నారు. అర్హులైన అందరికీ ఆరు గ్యారెంటీలు అందుతాయన్నారు.

  • 2024-25 ఓటాన్ అకౌంట్ బడ్జెట్ రూ. 2,75,891కోట్లు
  • ఆరు గ్యారెంటీల కోసం రూ. 53,196 కోట్లు అంచనా
  • పరిశ్రమల శాఖ రూ. 2,543 కోట్లు
  • ఐటి శాఖకు రూ. 7,74కోట్లు.
  • పంచాయతీ రాజ్ రూ. 40,080 కోట్లు
  • పురపాలక శాఖకు రూ. 11,692 కోట్లు
  • మూసీ రివర్ ఫ్రాంట్ కు వెయ్యి కోట్లు
  • వ్యవసాయ శాఖ రూ. 19,746 కోట్లు
  • ఎస్సి, ఎస్టీ గురుకుల భవన నిర్మాణాల కోసం రూ. 1,250కోట్లు
  • ఎస్సి సంక్షేమం రూ. 21, 874 కోట్లు
  • ఎస్టీ సంక్షేమం రూ. 13,013 కోట్లు
  • మైనార్టీ సంక్షేమం రూ. 2,262 కోట్లు
  • బీసీ సంక్షేమం, బీసీ గురుకుల భవనాల నిర్మాణం కోసం రూ. 1,546 కోట్లు.
  • బీసీ సంక్షేమం రూ. 8 వేల కోట్లు
  • విద్యా రంగానికి రూ. 21,389కోట్లు.
  • తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటుకు రూ. 5,00 కోట్లు.
  • యూనివర్సిటీల్లో సదుపాయాలకు రూ. 5,00 కోట్లు
  • వైద్య రంగానికి రూ. 11,500 కోట్లు
  • విద్యుత్ – గృహ జ్యోతికి రూ. 2,418కోట్లు.
  • విద్యుత్ సంస్థలకు రూ. 1,6825 కోట్లు.
  • గృహ నిర్మాణానికి రూ. 7,740 కోట్లు.
  • నీటి పారుదల శాఖకు రూ. 28,024 కోట్లు

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఆ వంద నోట్లతో హైదరాబాద్ సగం కొనేద్దామనుకున్నా.. టాలీవుడ్ హీరో..
ఆ వంద నోట్లతో హైదరాబాద్ సగం కొనేద్దామనుకున్నా.. టాలీవుడ్ హీరో..
ఇంటి అద్దెకు సమానంగా క్యాబ్‌ ఛార్జీలు.. వైరల్‌ అవుతోన్న పోస్ట్‌..
ఇంటి అద్దెకు సమానంగా క్యాబ్‌ ఛార్జీలు.. వైరల్‌ అవుతోన్న పోస్ట్‌..
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
సలార్ నటుడిపై లైంగిక ఆరోపణలు.. సంచలన విషయాలు బయటపెట్టిన చిన్మయి
సలార్ నటుడిపై లైంగిక ఆరోపణలు.. సంచలన విషయాలు బయటపెట్టిన చిన్మయి
ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌లో కుండపోత వానలు
ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌లో కుండపోత వానలు
రూ. 4000 పెన్షన్ పెంచిన ఘనత టీడీపీదే.. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు
రూ. 4000 పెన్షన్ పెంచిన ఘనత టీడీపీదే.. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!