Telangana: ఎస్సై వేధిస్తున్నాడంటూ.. స్టేషన్‌లోనే మహిళా ఏఎస్సై ఆత్మహత్యాయత్నం

|

Oct 10, 2024 | 2:02 PM

మెదక్ జిల్లా చిలిప్‌చేడ్ పీఎస్‌లో మహిళా ఏఎస్సై ఆత్మహత్యాయత్నం చేసింది. ఎస్‌ఐ యాదగిరి తనను కక్షపూరితంగా వేధింపులకు గురి చేస్తున్నాడని ఆరోపిస్తూ పురుగుల మందు తాగింది. తోటి సిబ్బంది ఆమెను ఆస్పత్రికి తరలించారు.

Telangana: ఎస్సై వేధిస్తున్నాడంటూ.. స్టేషన్‌లోనే మహిళా ఏఎస్సై ఆత్మహత్యాయత్నం
Female ASI Suicide Attempt
Follow us on

మెదక్‌ జిల్లా చిలిపిచెడ్‌ పోలీస్‌ స్టేషన్‌లో ASI సుధారాణి ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపింది. ఎస్‌ఐ యాదగిరి వేధిస్తున్నారంటూ సుధారాణి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా.. అప్రమత్తమైన సిబ్బంది.. ఆమెను జోగిపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థతి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఇక.. ఎస్‌ఐ వేధింపులపై ఆస్పత్రిలో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు ASI సుధారాణి. విధులకు హాజరవుతున్నా.. హాజరుకానట్లు కానిస్టేబుల్స్‌తో.. ఆబ్సెంట్‌ వేయిస్తున్నారని కన్నీటి పర్యంతమయ్యారు. అటు.. ఎస్‌ఐ యాదగిరిపై చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యుల డిమాండ్ చేశారు.

కాగా, ASI ఆత్మహత్యాయత్నం ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. అందరికీ రక్షణ కల్పించే మహిళా ఏఎస్ఐకి రక్షణ లేకపోతే సాధారణ మహిళలకు ఎలా రక్షణ కల్పిస్తారని పోలీసులను ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అయితే గతంలోనూ ఏఎస్సై సుధరాణి ఆత్మహత్య చేసుకుంటున్నానని.. ముగ్గురు ఎస్ఐలను బెదిరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఉన్నతాధికారులు ఇంటర్నల్ ఎంక్వైరీ చేస్తున్నారు.  విచారణ తర్వాత అసలు నిజాలు బయటకు రానున్నాయి.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..