‘నేను తీసుకోని లోన్ ఎలా కట్టాలి?’.. బ్యాంక్ నోటీసులతో రైతు ఏం చేశాడంటే..?

Sangareddy Farmer News: సంగారెడ్డి జిల్లాలో ఓ రైతు తీసుకోని రుణం తన పేరుపై నమోదైందని ఆరోపిస్తూ జిల్లా కలెక్టర్‌ను ఆశ్రయించాడు. బ్యాంక్ రికార్డుల్లో పొరపాటు కారణంగా లోన్ కట్టాలంటూ అధికారులు వేధిస్తున్నారని రైతు శంకరయ్య కన్నీటి పర్యంతమై ప్రజావాణిలో న్యాయం కోరాడు.

‘నేను తీసుకోని లోన్ ఎలా కట్టాలి?’.. బ్యాంక్ నోటీసులతో రైతు ఏం చేశాడంటే..?
Sbi Zaheerabad

Edited By:

Updated on: Jun 04, 2026 | 12:01 PM

SBI Loan Dispute: సంగారెడ్డి జిల్లాలో బ్యాంక్ అధికారుల వేధింపులతో జిల్లా కలెక్టర్‌ని ఆశ్రయించాడు ఓ రైతు. లోన్ తీసుకోకపోయినా తీసుకున్నట్టు బ్యాంక్ రికార్డుల్లో పేరు ఉండటంతో.. రైతును బ్యాంక్ అధికారులు లోన్ కట్టాల్సిందేనని వేధిస్తున్నారు. దీంతో బాధిత రైతు దిక్కుతోచని స్థితిలో పడి కన్నీటి పర్యంతమయ్యాడు. మునిపల్లి మండలం గార్లపల్లికి చెందిన రైతు శంకరయ్య మునిపల్లి SBI బ్యాంకులో తీసుకున్న రుణానికి వడ్డీతో సహా చెల్లించాడు. మళ్ళీ లోన్ తీసుకుందామని వెళ్తే మీ పేరుపై జహీరాబాద్ SBI బ్యాంకులో లోన్ ఉందని అది క్లియర్ చేస్తేనే లోన్ ఇస్తామని చెప్పడంతో రైతు షాక్ అయ్యాడు.

జహీరాబాద్‌లోని బ్యాంక్‌కి వెళ్లి లోన్ గురించి ఆరా తీయగా శంకరయ్య పేరుపై క్రాప్‌లోన్ ఉన్నట్టు రికార్డులో ఉంది. అయితే శంకరయ్య తండ్రి పేరు అడివయ్య కాగా రికార్డులో శంకరయ్య తండ్రి పేరు అయ్యప్పస్వామిగా ఉంది. ఇది తన లోన్ ఖాతా కాదని చెప్పినా.. బ్యాంక్ అధికారులు మాట వినకుండా లోన్ కట్టాల్సిందేనని చెప్పడంతో దిక్కుతోచని స్థితిలో పడ్డాడు శంకరయ్య. బ్యాంకు అధికారులు లోన్ కట్టాలని నోటీసులు కూడా ఇవ్వడంతో రైతు జిల్లా కలెక్టర్ ప్రతిక్ జైన్‌ని కలిసి ప్రజావాణిలో వేడుకున్నాడు. తన సమస్యని చెబుతూ కన్నీటిపర్యంతమయ్యాడు. ఇప్పటికైనా అధికారులు న్యాయం చేయాలని గోడు వెళ్లబోసుకున్నాడు.

తన గోడు వినిపిస్తున్న రైతు వీడియో..

 

Follow Us