
Telangana RTC Fact Check: ఏదైనా వైరల్ అయ్యిందంటే అది సోషల్ మీడియా అని చెప్పక తప్పదు. ప్రతి రోజు సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వైరల్ అవుతుంటాయి. ఎక్కువగా నిజం కంటే అబద్దమే ఎక్కువగా వైరల్ అవుతుంటుంది. ఇప్పుడు తెలంగాణ ఆర్టీసీలో కూడా అదే జరిగింది. కొందరు తెలంగాణ రాష్ట్ర రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (TGSRTC) మెట్రో ఎక్స్‌ప్రెస్ సర్వీసు బస్సు టికెట్ ధరలను పెంచిదంటూ తెగ ప్రచారం చేశారు. ఇది జనాలు కూడా నిజమే అనుకున్నారు.
అయితే వైరల్ అవుతున్న టికెట్ ధరలపై తెలంగాణ ఆర్టీసీ క్లారిటీ ఇచ్చింది. వైరల్ అవుతున్నదానిలో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది. టికెట్ రేట్లను పెంచలేదని, TGSRTC మేనేజింగ్ డైరెక్టర్ వై.నాగిరెడ్డి తెలిపారు. ప్రస్తుత అవసరానికి అనుగుణంగా అక్టోబర్ 6, 2025న గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఆర్టీసీ నడిపే బస్సుల్లో టికెట్లపై ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సెస్ విధించామని, కానీ ఆ తరవాత రాష్ట్రంలో ఆర్టీసీ నడిపే బస్సుల్లో ఎలాంటి టికెట్ ధరలను పెంచలేదన్నారు.
ఇది కూడా చదవండి: Zodiac Sign: ఈ 3 రాశుల వారికి డిసెంబర్ నెల ఎంతో అదృష్టం.. జీవితాల్లో ఎన్నో అద్భుతాలు
సాధారణంగా ఆర్టీసీ బస్సు టిక్కెట్ల ధరల పెరుగుదల డీజిల్ ధరకు నేరుగా అనుసంధానంగా పెరుగుతాయి. ఇంధన ధరలు పెరిగినప్పుడల్లా ఆర్టీసీ ధరల పెరుగుదలను ప్రతిపాదిస్తూ ప్రభుత్వానికి లేఖ రాస్తాం. కానీ చాలా సందర్భాల్లో టికెట్ ధరల పెంచడం వల్ల ప్రయాణికులకు కలిగే ఆసౌకర్యాని దృష్టిలో ఉంచుకుని ఆ ప్రతిపాదనను తిరస్కరిస్తామని స్పష్టం చేశారు. కాకపోతే, టికెట్లపై ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సెస్ వసూలు చేస్తున్నా విషయం చాల కాలం తరవాత ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్న వారికి తెలియకపోవచ్చని ఆయన అన్నారు.
అధికారిక వివరణ
సోషల్ మీడియా లో కొందరు తెలంగాణ రాష్ట్ర రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (TGSRTC) మెట్రో ఎక్స్‌ప్రెస్
సర్వీసు బస్సు టికెట్ ధరలను పెంచింది అని ప్రచారం చేసారు. అందులో ఎలాంటి నిజం లేదు.TGSRTC మేనేజింగ్ డైరెక్టర్ వై.నాగిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం, ప్రస్తుత…
— FactCheck_Telangana (@FactCheck_TG) November 25, 2025
ఇది కూడా చదవండి: IT Engineer Rapido: ర్యాపిడో డ్రైవర్‌గా మారిన ఐటీ ఇంజనీర్.. కారణం తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి