గుప్త నిధులు ఉన్నాయంటూ కేటుగాళ్ల దొంగ పూజలు.. పోలీసుల ఎంట్రీతో సీన్ రివర్స్!

ఓ ప్రాంతంలో నిధుల కోసం కొందరు వ్యక్తులు రహస్యంగా పూజలు నిర్వహిస్తుండగా స్థానికులు గమనించారు. వెంటనే అప్రమత్తమైన గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గుప్తనిధుల కోసం తవ్వకాలు చేపట్టిన ఐదుగురు నిందితులను..

గుప్త నిధులు ఉన్నాయంటూ కేటుగాళ్ల దొంగ పూజలు.. పోలీసుల ఎంట్రీతో సీన్ రివర్స్!
Excavation For Hidden Treasures In Mancherial

Edited By:

Updated on: May 17, 2026 | 12:42 PM

చెన్నూర్, మే 17: కొందరు కేటుగాళ్లు అమాయకులను‌ టార్గెట్ చేసి భారీగా ఆశలు చూపి మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలం రచ్చపెల్లి గ్రామంలోని ఓ ప్రాంతంలో నిధుల కోసం కొందరు వ్యక్తులు రహస్యంగా పూజలు నిర్వహిస్తుండగా స్థానికులు గమనించారు. వెంటనే అప్రమత్తమైన గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గుప్తనిధుల కోసం తవ్వకాలు చేపట్టిన ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు పరారయ్యారు.

వివరాల్లోకి వెళితే మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం రచ్చపల్లి గ్రామ శివారులో గుప్తనిధుల పేరిట పూజలు, తవ్వకాలు జరుపుతున్న వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. రచ్చపల్లి గ్రామ సమీపంలోని వ్య సాయ భూమిలో గుప్తనిధుల కోసం తవ్వకాలు జరుపుతున్నారన్న సమాచారం మేరకు శుక్రవారం అర్ధరాత్రి సంఘటనా స్థలానికి వెళ్లగా.. పోలీసులను చూసి వారు పారిపోయారు. అక్కడ పూజా వస్తువులు, ఇతర సామగ్రి లభించాయి. రెవెన్యూ అధికారుల ద్వారా ఫిర్యాదు స్వీకరించి కేసు నమోదు చేసి విచారణ చేపట్టగా వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.

రచ్చపల్లికి చెందిన జక్కుల కుమార్ తన భూమిలో గుప్తనిధులు వెలికి తీసేందుకు స్థానికుడైన మరాఠీ స్వామితో పాటు చెన్నూరు, భీమారం మండలాల్లోని చాకేపల్లి, పొన్నారం, ఆరెపల్లి, మద్దికల్ గ్రామాలకు చెందిన సోదరి రాజస మ్మయ్య, కస్తూరి భూమయ్య, రాజేష్, జాడి నర్సయ్య, తిప్పర్తి రమేష్లను పురమాయించాడు. వారంతా కలిసి తవ్వకాలు జరిపేందుకు సిద్ధమైనట్లు తమ విచారణలో తేలిందన్నారు. జక్కుల కుమార్, మరాఠీ స్వామి పరారీలో ఉండగా.. మిగతా అయిదుగురిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు సీఐ వివరించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.

Follow Us