వైరా వేదికగా పొలిటికల్ స్పీడ్ పెంచుతున్నారు మాజీ ఎంపీ పొంగిలేటి. భారీ స్థాయిలో వైరాలో నిర్వహిస్తున్న పొంగిలేటి ఆత్మయ సమ్మేళనం సభకు సర్వం సిద్దమైంది. ఖమ్మం జిల్లా మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పొలిటికల్ స్పీడ్ పెంచారు. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రం వేదికగా అనుచరులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్నారు. ఈ ఆత్మీయ సమ్మేళనం సభకు భారీ స్థాయిలో ఏర్పాట్లు చేశారు పొంగులేటి వర్గీయులు.
ఈ ఏర్పాట్లను పొంగులేటి క్యాంపు కార్యాలయం ఇన్చార్జ్ దయాకర్ రెడ్డి, రాష్ట్ర మార్క్ఫెడ్ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్, మున్సిపల్ చైర్మన్ జైపాల్, పొంగులేటి అనుచరులు దగ్గర ఉండి సభ ఏర్పాట్లను పర్యవేక్షించారు. సభను సక్సెస్ చేసేందుకు పొంగులేటి అనుచరులు శక్తి వంచన లేకుండా పనిచేశారు. సభకు వచ్చే అభిమానులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా వాలంటీర్లను ఏర్పాటు చేశారు. వైరా నియోజకవర్గ కేంద్రంలో ఆత్మీయ సమ్మేళన సభ భారీ స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు రాష్ట్ర మార్క్ఫెడ్ వైస్ చైర్మన్ బొర్ర రాజశేఖర్. ఆత్మీయ సభకు వేలసంఖ్యలో అభిమానులు వస్తారని చెప్పారు.
సభ విజయవంతం అవుతుందన్నారు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పొంగులేటి వర్గం నుంచి విజయంఖాయమని.. గెలిపించేందుకు ఈ సభ ఉపయోగపడుతుందన్నారు. సభలో విజయబాయిని పరిచయం చేస్తామని అన్నారు. ఇక బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన వైరా పట్టణ అధ్యక్షుడు దార్నా రాజశేఖర్ తో పాటు ముగ్గురు వార్డు కౌన్సిలర్లు, ఐదుగురు వార్డు కమిటీ అధ్యక్షులు వైరాలో జరిగే పొంగులేటి ఆత్మీయ సమ్మేళనం సభలో శ్రీనివాసరెడ్డి సమక్షంలో పొంగులేటి వర్గంలో చేరనున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..