Maoist Movement: బుల్లెట్ దిగలేదు.. నెత్తురు చిమ్మలేదు! ముగిసిన మావోయిస్టు శకం..

ఏదేమైనా.. మొదటగా మావో రహిత రాష్ట్రంగా తెలంగాణ రికార్డు సృష్టించబోతోంది. ఐదు దశాబ్దాల క్రితం పుట్టిన పార్టీ.. తొలుత కంప్లీట్‌గా కనుమరుగవుతున్నది కూడా ఈ గడ్డమీదనే. అయితే.. మావో రహిత తెలంగాణ ప్రక్రియ అంత ఈజీగా ఏం జరగలేదు. కోవర్టు ఆపరేషన్‌లు, సరెండర్లు, కూంబింగ్‌లు, ఎన్‌కౌంటర్లు, కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడి.. ఇలాంటి ఎన్నో వ్యూహాలతో వెళ్లింది ఇంటెలిజెన్స్ వ్యవస్థ.

Maoist Movement: బుల్లెట్ దిగలేదు.. నెత్తురు చిమ్మలేదు! ముగిసిన మావోయిస్టు శకం..
Maoist Movement in Telangana

Updated on: Feb 25, 2026 | 9:49 PM

పోలీసులు కూంబింగ్‌కొస్తే.. అన్నలను కడుపులో పెట్టి దాచేసుకున్నారు ఆదివాసీలు. ఒక్కోసారి పోలీస్ జీపులనే తగలబెట్టేశారు. ఖాకీ నీడ కూడా వారిపై పడనిచ్చేవారు కాదు. అన్నలంటే హీరోలు వాళ్ల దృష్టిలో. అలాంటి వాతావరణం ఉండేది ఒకప్పుడు. బట్.. ఎప్పుడైతే ప్రతీదీ హింసతోనే సాధ్యమని ఓవైపు తీసుకున్నారో.. అప్పుడే పోరాటమూ బలహీనపడింది. బస్సులు, రైళ్లు, ప్రభుత్వ ఆఫీసులు తగలబెట్టడం, బాంబులతో పేల్చేయడం.. ఇదంతా ఏంటన్న ప్రశ్న ఉదయించింది. ఎంతకాదన్నా.. అవి ప్రజల ఆస్తులు. ఎవరి కోసమైతే పోరాడుతున్నారో.. అదే పోరాటంలో అమాయకులూ సమిధలయ్యారు. ఒకనాడు పిలిస్తే పలికారు. రానురాను అరిచినా.. కనలేని, వినలేని దూరానికి వెళ్లిపోయారు. ఇప్పుడు.. పిలిచినా ఎన్నటికీ రానంతగా కనుమరుగయ్యారు. మావో రహిత తెలంగాణ.. ఇదెలా సాధ్యమైందో చెప్పుకునే ముందు.. మావో రహిత భారత్‌గా ఎలాంటి వ్యూహంతో కదిలారో తెలుసుకోవాలి. ఆపరేషన్ కగార్.. 2024 జనవరి 1న మొదలైంది. కాని, మావోల ఏరివేతను మొదలుపెట్టింది 2019లో.. మన్మోహన్ సింగ్ హయాంలో. ‘ఇక అంతం తప్పదు’ అని వాడింది ఆయనే. ఏపీ, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, బిహార్, మహారాష్ట్ర.. ఇలా 10 రాష్ట్రాల్లోని 61 జిల్లాల్లో 245 పోలీస్ స్టేషన్ల పరిధిలోని మావోల బలం, బలగంపై ఫోకస్ పెట్టారు. పక్కా ప్లానింగ్ అది. ముందుగా CRPF, ITBT,...

Follow Us

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి