Delhi liquor scam case: మద్యం కేసులో అరెస్ట్ అయిన కవితను ఈడీ కస్టడీకి అనుమతిచ్చిన రౌస్ అవెన్యూ సీబీఐ ప్రత్యేక కోర్టు.. పలు కీలక ఆదేశాలు జారీ చేసింది. కవిత ఆరోగ్య దృష్ట్యా ప్రతి రోజు మెడికల్ టెస్ట్‌లు చేయాలని ఆదేశించింది. సాయంత్రం 6గంటల నుంచి 7గంటలవరకూ ప్రతిరోజు కుటుంబ సభ్యులును కలిసేందుకు, న్యాయవాదులతో చర్చించేందుకు అనుమతి ఇవ్వాలని కోర్టు చెప్పింది. అలాగే ఇంటి నుంచి తెచ్చిన ఆహారం తీసుకునేందుకు ప్రత్యేక కోర్టు అనుమతించింది. అలాగే కస్టడీ టైంలో పుస్తకాలు చదివేందుకు .. కేసుకు సంబంధించినవి రాసుకోవడానికి, స్పెట్స్ కి అనుమతివ్వాలని విజ్ఞప్తి చేయడంతో .. వీటన్నింటికి న్యాయస్థానం ఓకే చెప్పింది. కస్టడీ టైంలో ఈడీ కేంద్ర కార్యాలయంలో మహిళా అధికారుల భద్రతతో ప్రత్యేక గదిని కేటాయించారు.
కవిత కస్టడీ నేపథ్యంలో కేటీఆర్, హరీష్‌రావు ఢిల్లీకి బయలుదేరారు. కోర్టు నిర్దేశించిన సమయంలో కవితను కలుస్తారు కేటీఆర్, హరీష్‌రావు. కేటీఆర్ వెంట మాజీ మంత్రి ప్రశాంత్‌రెడ్డి, జీవన్‌రెడ్డి, జాన్సన్‌నాయక్ వెళ్తున్నారు.
మరోవైపు కవితను వారం రోజుల ఈడీ కస్టడీకి కోర్టు అప్పగించడంతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఢిల్లీ అడ్వొకేట్ టీమ్‌ను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. సోమా భరత్ ఆధ్వర్యంలో ప్రత్యేక లీగల్ సెల్ ఏర్పాటు చేస్తున్నారు. వీరితో పాటు ఢిల్లీలోని ప్రముఖ న్యాయవాదులతోనూ కేసీఆర్ మాట్లాడుతున్నట్లు తెలుస్తోంది. కవిత కేసు కొలిక్కి వచ్చే వరకు కొందరు కుటుంబ సభ్యులు కూడా ఢిల్లీలోనే ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే పలువురు మాజీ మంత్రులు, పలువురు కీలక నేతలు ఢిల్లీలోనే మాకాం వేసి.. అక్కడ జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ కేసీఆర్ కు చేరవేస్తున్నారు..
ఇవాళ్టి నుంచి కవితను ఏడు రోజుల పాటు ఈడీ అధికారులు విచారించనున్న నేపథ్యంలో సోమా భరత్ ఆధ్వర్యంలో అడ్వొకేట్ టీమ్ ఆమెకు అందుబాటులో ఉంటూ సూచనలు ఇవ్నుంది. ఈడీ అధికారులు అడిగే ప్రశ్నలు.. ఆమె చెప్పే సమాధానాలపై వారు ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు ఇవ్వనున్నారు. ములాఖత్ సమయంలో న్యాయవాదుల టీమ్ అందుబాటులో ఉండి సూచనలు ఇవ్నుంది. రిమాండ్ పూర్తయ్యే వరకు లేదా కేసు తేలే వరకు సోమా భరత్ టీమ్ అందుబాటులో ఉండనుంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..