దసరా వచ్చేసింది.. గ్రామాల్లో, పట్టణాల్లో ఎక్కడ చూసినా సందడి నెలకొంది.. ఇప్పటికే పాఠశాలలకు సెలవులు ఇవ్వడంతో.. అన్ని చోట్లా పండగ వాతావరణమే కనిపిస్తోంది.. బతుకమ్మ సంబరాలు, నవరాత్రి వేడుకలతో తెలంగాణ వ్యాప్తంగా దసరా సంబరాలు అంబరాన్నంటుతున్నాయి.. ఇప్పటికే.. స్కూళ్లకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది.. ఈ క్రమంలోనే తెలంగాణ జూనియర్ కాలేజీలకు దసరా సెలవులు ప్రకటించింది.. ఈ నెల 6 నుంచి 13 వరకు ఇంటర్ కాలేజీలకు దసరా సెలవులను ప్రకటిస్తూ గురువారం ప్రకటన విడుదల చేసింది.. తిరిగి 14న జూనియర్ కళాశాలలు తెరుచుకోనున్నాయి.. ఈ మేరకు తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యా మండలి ప్రకటన విడుదల చేసింది..
ఇంటర్మీడియట్ విద్యార్థులకు మొత్తం 8 రోజుల పాటు దసరా సెలవులను ప్రకటించింది. అన్ని కళాశాలలు తప్పనిసరిగా సెలవులు మంజూరు చేయాలని వెల్లడించింది.. ప్రైవేటు కళాశాలలు కూడా ఈ సర్క్యూలర్ ను తప్పనిసరిగా పాటించాలని.. లేకపోతే చర్యలు తీసుకుంటామని ఇంటర్మీడియట్ బోర్డు వెల్లడించింది.
కాగా.. తెలంగాణలో స్కూళ్లకు దసరా సెలవులు నిన్నటినుంచే ప్రారంభమయ్యాయి. అక్టోబర్ 02 నుంచి 14 వరకు దసర సెలవులు ప్రకటిస్తూ రాష్ట్ర విద్యాశాఖ సర్క్యూలర్ జారీ చేసింది. సెలవుల అనంతరం ఈనెల 15న పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..