Telangana: తాగిన మత్తులో తన ఇంటికి కాకుండా పక్క ఇంటికి వెళ్లిన ఎస్సై.. ఆ తర్వాత సీన్ సితార్

|

Dec 01, 2022 | 1:34 PM

మందు కుమ్మేశాడు. తడబడుతూనే ఇంటికి వెళ్లాడు. అయితే అయోమయంలో తన ఇంటికి కాకుండా పక్కింటికి వెళ్లాడు. దీంతో వారు ఇతడిని కుమ్మేశారు. తీరా ఆరా తీసేసరికి..

Telangana: తాగిన మత్తులో తన ఇంటికి కాకుండా పక్క ఇంటికి వెళ్లిన ఎస్సై.. ఆ తర్వాత సీన్ సితార్
Drunk Sub Inspector
Follow us on

తాగిన మత్తులో ఓ వ్యక్తి ఇంటికి వెళ్లబోయి, పక్కింటి తలుపు తట్టి లోనికి వెళ్లాడు..అంతే అతడిని పట్టుకుని చితకబాది చెట్టుకట్టేశారు స్తానికులు..ఆ తర్వాత అతడు ఎవరో తెలిసి షాక్‌కి గురైయ్యారు. ఎందుకంటే వాళ్లు చెట్టుకు కట్టేసింది ఓ ఎస్సైని కనుక. ఈ ఘటన మహబూబ్‌నగర్‌ జిల్లాలో జరిగింది..

జిల్లాలోని రాజాపూర్ మండల పోలీస్‌స్టేషన్‌లో SIగా పనిచేస్తున్నాడు శ్రీనివాస్‌. మద్యం మత్తులో ఆయన తన ఇల్లు అనుకుని పక్కింటికి వెళ్లాడు. అయితే శ్రీనివాస్‌ సాధారణ దుస్తుల్లో ఉండటంతో వచ్చింది ఎస్సై అని తెలియక చితకబాది చెట్టుకు కట్టేశారు స్తానికులు. ఇదంతా జరిగాక ఆ వచ్చింది ఎస్సై అని తెలిసింది. అయితే ఈ ఘటన మహబూబ్‌నగర్‌ జిల్లా పోలీసు వర్గాల్లో చర్చనీయాంశమైంది.

మరి అంత సోయి లేకుండా తాగిన ఎస్సైని నెటిజన్స్ కామెంట్స్‌తో వాయగొడతున్నారు. ఎస్సై గారిని ఆయన పని చేస్తున్న స్టేషన్‌ సెల్‌లో వేయాలని అని ఒకరు పేర్కొనగా.. మందు ఫ్రీగా వచ్చినట్టుంది అందుకే సారు గారు పీకలదాకా తాగారు అని మరొకరు రాసుకొచ్చారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం