Telangana: షేపెంట్స్ లేరు.. పోలీసులను చూసి స్పీడ్ పెంచిన అంబులెన్స్ డ్రైవర్.. ఆపి తనిఖీ చేయగా

ప్రాణాలను కాపాడాల్సిన అంబులెన్స్… అదే అంబులెన్స్‌ను మద్యం మత్తులో నడిపిన డ్రైవర్! వరంగల్‌లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీల్లో 226 డ్రంక్ రీడింగ్‌తో అడ్డంగా బుక్కైన అంబులెన్స్ డ్రైవర్ ఘటన కలకలం రేపుతోంది. పూర్తి వివరాలు కథనం లోపల తెలుసుకుందాం పదండి ...

Telangana: షేపెంట్స్ లేరు.. పోలీసులను చూసి స్పీడ్ పెంచిన అంబులెన్స్ డ్రైవర్.. ఆపి తనిఖీ చేయగా
Drunk Ambulance Driver

Edited By:

Updated on: Dec 20, 2025 | 2:43 PM

ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులను సురక్షితంగా ఆసుపత్రికి చేర్చాల్సిన బాధ్యత అంబులెన్స్‌దే. అలాంటి అంబులెన్స్‌ను నడిపే డ్రైవర్‌నే మద్యం మత్తులో వాహనం నడిపితే ఇక బాధితుల ప్రాణాలకు భరోసా ఎక్కడ ఉంటుంది? అసలు సమస్య పక్కనపెడితే… ప్రమాదం జరిగి ప్రాణాలు ముందే పోయే పరిస్థితి నెలకొంటుంది. వరంగల్‌లో ఇలాంటి ఆందోళనకర ఘటన వెలుగుచూసింది.

ఓ అంబులెన్స్ డ్రైవర్ మద్యం మత్తులో అంబులెన్స్ నడుపుతూ ట్రాఫిక్ పోలీసుల తనిఖీల్లో అడ్డంగా బుక్కయ్యాడు. ఘటనపై స్పందించిన ట్రాఫిక్ పోలీసులు డ్రైవర్‌పై కేసు నమోదు చేసి, అంబులెన్స్‌ను సీజ్ చేశారు. వరంగల్ నగరంలో డ్రంక్ అండ్ డ్రైవ్‌పై ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఈ క్రమంలో వరంగల్–నర్సంపేట రోడ్డుపై విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో లోహిత అంబులెన్స్ సర్వీస్‌కు చెందిన ప్రైవేట్ అంబులెన్స్ డ్రైవర్ అనుమానాస్పదంగా కనిపించడంతో వాహనాన్ని ఆపారు. TS 05 UA 6305 నంబర్ గల అంబులెన్స్ డ్రైవర్‌ను బ్రీత్ అనలైజర్‌తో పరీక్షించగా, ఏకంగా 226 రీడింగ్ నమోదు కావడం గమనార్హం. ఇది చూసి పోలీసులే అవాక్కయ్యారు. డ్రైవర్ భాస్కర్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు అంబులెన్స్‌ను సీజ్ చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..