CM KCR Health Update: నిలకడగా సీఎం కేసీఆర్‌ ఆరోగ్యం.. హోం ఐసోలేషన్‌లో చికిత్స అందిస్తున్న ప్రత్యేక వైద్యుల బృందం

|

Apr 21, 2021 | 7:54 AM

CM KCR: కరోనా బారిన పడిన సీఎం కేసీఆర్‌ ఆరోగ్యపరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

CM KCR Health Update: నిలకడగా సీఎం కేసీఆర్‌ ఆరోగ్యం..   హోం ఐసోలేషన్‌లో చికిత్స అందిస్తున్న ప్రత్యేక వైద్యుల బృందం
Cm Kcr
Follow us on

CM KCR: కరోనా బారిన పడిన సీఎం కేసీఆర్‌ ఆరోగ్యపరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఎర్రవెల్లి ఫామ్‌ హౌస్‌లో హోం ఐసోలేషన్‌లో ఉన్న ఆయనకు వ్యక్తిగత వైద్యుడు ఎంవీ రావు నేతృత్వంలోని వైద్యుల బృందం చికిత్స అందిస్తోంది. మంగళవారం రాష్ట్ర మంత్రి కేటీ రామారావు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్‌లు ఆయనను కలిసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డిలు మంగళవారం ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఫోన్‌లో పరామర్శించారు. సీఎం త్వరగా కోలుకోవాలని అన్ని ఆలయాల్లో పూజలు చేయాలని దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పూజారులను కోరారు. మరోవైపు, రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ కార్యకర్తలు సీఎం కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు.

ఇదిలావుంటే, ఈనెల 19న సీఎం కేసీఆర్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ముఖ్యమంత్రికి కరోనా సోకిందని సీఎస్ సోమేశ్ కుమార్ వెల్లడించారు. ఆయన స్వల్ప లక్షణాలతో బాధపడుతున్నారని తెలిపారు. కాగా, హోం ఐసోలేషన్ లో ఉండాలని కేసీఆర్ కు వైద్యులు సూచించారు. ప్రస్తుతం సీఎం కేసీఆర్ ఫాంహౌస్‌లో ప్రత్యే్క వైద్యుల బృందం పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్య నిపుణుల బృందం ఎప్పటికిప్పుడు నిశితంగా పర్యవేక్షిస్తోంది. రెండు వారాల కిందట సీఎస్ సోమేశ్ కుమార్ కు కరోనా పాజిటివ్ వచ్చింది. ఆయన పూర్తిగా కోలుకుని విధులకు హాజరవుతున్నారు.

Read Also…  భద్రాద్రి లో ఘనంగా శ్రీ సీతారాముల కళ్యాణం చూద్దాం రారండి :Srirama Navami 2021 Live Vieo.