
సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్.. జిల్లాలో వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. తన విధుల్లో భాగంగా నూతనకల్ మండలం గుండ్లసింగారంలో కస్తూర్బా పాఠశాలను ఆయన తనిఖీ చేశారు. సమీపంలోనీ అంగన్వాడీ కేంద్రం ఉండడంతో అక్కడికి వెళ్లారు. ఆ సమయంలో అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులు తమ ఆటల్లో మునిగిపోయారు. వారంతా 2010 నుంచి 2024 మధ్య పుట్టిన జెన్ ఆల్ఫా తరంకు చెందిన ఐదేళ్లలోపు వారే. క్లాసులోకి అడుగుపెట్టిన వెంటనే కలెక్టర్‌కు చిన్నారులంతా తమ చిన్ని గొంతులతో గుడ్ మార్నింగ్ సార్.. అని పలకరించారు.
దీంతో కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ కూడా గుడ్ మార్నింగ్ చెప్పారు. కలెక్టర్ అంగన్వాడీ కేంద్రంలోని వివిధ బొమ్మలను చూపిస్తూ.. వాటి పేర్లు అడుగుతుంటే.. పిల్లలంతా హుషారుగా సమాధానాలిచ్చారు. ఆ తర్వాత కలెక్టర్ ఒక్కొక్కరి పేరు అడుగుతుంటే.. ఆ చిన్నారులు చెబుతూ వచ్చారు. కానీ ఓ బుడ్డోడు మాత్రం.. తన పేరు చెప్పేందుకు కలెక్టర్‌కు ఓ కండిషన్ పెట్టాడు. ఆ కండిషన్ విని కలెక్టర్ షాక్ అయ్యాడు. తనను ఎత్తుకుంటేనే పేరు చెబుతానంటూ కండిషన్ పెట్టాడు. దీంతో తనను ఇంప్రెస్ చేసిన బుడ్డోడిని కలెక్టర్ ఎత్తుకున్నాడు. బాగా చదువుకోవాలని కలెక్టర్ చిన్నారులకు చెప్పారు. అంగన్వాడి కేంద్రం నుంచి వెళ్తున్న జిల్లా కలెక్టర్‌కు చిన్నారులంతా బయటకు వచ్చి టాటా చెప్పారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..