Disha Encounter Case: కీలక దశకు దిశ ఎన్‌కౌంటర్ కేసు.. సుప్రీం తీర్పు ఎలా ఉంటుందో..!

|

May 20, 2022 | 9:03 AM

Disha Encounter Case: దిశ ఎన్‌కౌంటర్ కేసు కీలక దశకు చేరుకుంది. సిర్పూర్‌ కర్‌ కమిషన్‌ రిపోర్టుపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుంది.

Disha Encounter Case: కీలక దశకు దిశ ఎన్‌కౌంటర్ కేసు.. సుప్రీం తీర్పు ఎలా ఉంటుందో..!
Disha
Follow us on

Disha Encounter Case: దిశ ఎన్‌కౌంటర్ కేసు కీలక దశకు చేరుకుంది. సిర్పూర్‌ కర్‌ కమిషన్‌ రిపోర్టుపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుంది. అటు తర్వాత కీలక ప్రకటన చేసే ఛాన్స్‌ ఉంది. దిశ అత్యాచారం, హత్య తర్వాత పోలీస్ కస్గడీలో ఉండగా జరిగిన నిందితుల ఎన్ కౌంటర్ బుటకమా? నిజమైనదా? అని నిగ్గు తేల్చనుంది సుప్రీంకోర్టు. కమిషన్‌ ఇచ్చిన రిపోర్ట్‌పై టెన్షన్‌ నెలకొంది.

దిశ కేసుపై సుప్రీం కోర్ట్ నియమించిన జ్యూడీషియల్ కమీషన్ విచారణ ముగిసింది. జనవరి మొదటి వారంలో దిశ కమిషన్ రిపోర్ట్‌ను సుప్రీంకోర్టుకు సమర్పించింది. రంగారెడ్డి జిల్లా చటాన్ పల్లిలో 2019 డిసెంబర్ 6న దిశ అత్యాచారం, హత్య కేసులో నలుగురు నిందితులు పోలీసు కస్టడీలో ఉండగానే ఎన్‌కౌంటర్‌ జరిగింది. కొంత మంది ఫిర్యాదు మేరకు సిర్ఫూర్‌ కమిషన్‌ 3ఏళ్ల పాటు విచారించింది. ఎన్ కౌంటర్ కు గురైనా కుటుంబ సభ్యులు, ఈ కేసులో ఉన్న 18 సాక్ష్యులను, ఎన్ కౌంటర్ పాల్గొన్న పోలీస్ అధికారులు, అప్పటి కమిషనర్ సజ్జనార్, శంషాబాద్ డిసిపి గా ఉన్న ప్రకాష్ రెడ్డి, సిట్ అధికారి మహేష్ భగవత్, జాతీయ మానవ హక్కుల సభ్యుల నివేదిక అన్ని అంశాలను నమోదు చేసుకుని రిపోర్ట్‌ను తయారు చేసింది.

సుప్రీంకోర్టుకు కమిషన్ రిపోర్ట్‌ను సమర్పించిన తర్వాత.. విచారణ గోప్యంగా ఉంచాలని తెలంగాణ పోలీసులు సుప్రీంకోర్టును కోరారు. గోప్యత పాటించాల్సిన అవసరం లేదని కోర్టు తేల్చిచెప్పింది. ఇప్పటికే నాలుగు సార్లు వాయిదా వేసిన కోర్టు ఇవాళ్టి విచారణలో ఎలాంటి అంశాలను ప్రస్తావిస్తుందనేది తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

దాదాపు మూడేళ్ల తర్వాత దిశ కేసు మళ్లీ తెర మీదుకు వచ్చింది. నిందితుల పై పైరింగ్‌ ఉద్దేశ పూర్వకంగా చేసినవా? ఆత్మ రక్షణలో బాగంగా జరిపిన కాల్పులా? అనే అన్ని అంశాలను కమిషన్ సభ్యులు సిర్పూర్ కర్, రేఖా ప్రకాష్, కార్తికేయన్ నివేదికను సుప్రీంకోర్టు కు సమర్పించారు. ఈ రిపోర్టుపై సుప్రీం కోర్టు కీలక ప్రకటన చేయనుంది. ఇప్పుడు దీనిపై సర్వత్రా ఆసక్తి నెలకింది.